ఆర్టీసీ బస్సులో భారీ నగదు పట్టివేత.. 

RTC Bus, lakhs of amount, Telangana assembly elections, Kpal check post

మేడ్చల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం, కోట్లాది నగదు భారీగా తరలిస్తున్న తరుణంలో పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. పోలీసుల తనిఖీల్లో భాగంగా గురువారం మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీస్, ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి కెపాల్ చెక్ పోస్ట్ వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నుంచి హైద్రాబాద్‌కు టీఎస్ ఆర్టీసీ బస్సులో భారీ మొత్తంలో నగదు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దాదాపు రూ. 3,04000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దమొత్తంలో నగదును తరలిస్తున్న దత్తారి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు