ఇంటికి దీపం ఇల్లాలు

Updated By ManamSun, 10/07/2018 - 01:37
girl

girlగడియారికాం లేదు గవ్వ రాకటలేదు- ఎప్పు డో విన్న సామెత. గవ్వ రాకట మాటుంచండీ ... కుటుంబంలో ప్రతి ఒక్క రూ ఏదో ఒక మాటం టూనే ఉంటారు. ప్రస్తుత పరిస్థితిలో గృహిణి జీవి తం అలాగే ఉంది. ఉద యం అందరికంటే ముం దుగానే మేల్కోవడం నుంచి మొదలు కొని రాత్రి అందరూ పడుకునేంత వరకు మెలకువతో ఉండి,  తీరిక లేకుండా పనిచేస్తున్న గృహిణి అలసి పోతుంది. ఇంటిని చూసి ఇల్లాలు గొప్పతనం చెప్ప వచ్చు అని మన తాతయ్య, బామ్మలు చెప్పినట్లుగా గుర్తుం ది. అది ఒకప్పటి నానుడి ప్రస్తుతం ఇల్లాలిని గుర్తించే వారి సంఖ్య తగ్గుతోందా.. నేను పనిచేస్తూ ఉన్నాను అని గొప్ప గా చెప్పుకుంటారు. ఎలాంటి గొప్పలు చెప్పుకోని వ్యక్తే గృహిణి. గృహిణి జీవితం అంత సులభమైనదేం కాదు. గృహిణి అనగానే ఇంటిలోని పనులను చేసే, ప్రతి కుటుంబ సభ్యుని అవసరాలను తీర్చే పూర్తి బాధ్యతను కలిగి ఉన్న వ్యక్తిగా మాత్ర మే భావిస్తూ ఉన్నారు. ఇంటి ఇల్లాలు ఇంటి పనులు సరైన సమయానికి పూర్తిచేయడానికి రోజంతా కష్టపడుతూ ఉంది. గృహిణితోటే కుటుంబంలో సంతోషం, ఆనందం, కుటుంబానికి మూలాధారం. ప్రస్తుతం చాలా మంది మహిళలు ఈ బాధ్యతలను అన్నింటిని  ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి చేస్తూ ఉన్నారు. కొంతమంది మహి ళలో మాత్రం గృహిణిగా జీవితాంతం ఇంతేనా అనే నిరాశ తో, నిస్పహలతో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆందో ళన, కుంగుబాటుకు లోనవుతున్న గృహిణుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే కుటుం బ నిర్వహణ కొనసాగడం చాలా కష్టంగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుత గృహిణులు తరచుగా డిప్రెషన్‌కు, ఆందోళ నకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. రోజంతా కష్టపడ్డా తను చేసే కష్టానికి తగ్గ ప్రతిఫలం కుటుంబ సభ్యుల నుంచి లభించకపోవడం. కుటుంబ సభ్యులెవరూ గృహి ణి శ్రమ విలువను గుర్తించక పోవడం, ప్రశంసించక పోవ డంతో ఎక్కువమంది గృహిణులను డిప్రెషన్‌కు గురి చేస్తోంది.

కుటుంబ సభ్యులు గృహిణి చేసే శ్రమకు, విలువను ఇవ్వక పోగా గృహిణిగా తన డ్యూటీయే కదా అని భావించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇంటి పనులన్నీ, కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడం తనవిధిగా భావించడం. ఆరోగ్యం బాగా లేకున్నా తన పనులలో కుటుంబ సభ్యుల సహకారం లభించక పోవడం మూలంగా మనసులో ఆం దోళనలు ఎదుర్కొంటోంది. గృహిణి విశ్రాంతి లేకుండా సంవత్సరంలోని సెలవు రోజులతో సహా 365 రోజులు పని చేస్తూనే ఉంటుంది. శ్రమ విలువను గుర్తించక పోవడం, ఇంటిలోని పనులతో గృహి ణులలో నిరాశ, నీరసం, శక్తిహీనత పెరిగే అవకాశం ఎక్కువవుతోంది. కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగు వ్యక్తులు తరచూ గృహిణులను పని చేస్తున్న మహిళ లతో పోల్చు తూ ఉంటారు. గృహిణులను డబ్బులు సంపా దించే ఉద్యోగం చేయడం లేదని వారిని చులకనగా చూసే వారు ఎక్కువవుతున్నారు. సమయం తీరిక లేకుండా పని చేయడం, ఆందోళనలు, తీవ్రమైన ఒత్తిడి దీర్ఘకాలంగా ఉం టే డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. డిప్రెషన్‌ను ముందుగానే గుర్తిస్తే డిప్రెషన్‌ను సులభంగా జయించవచ్చు. గృహిణిలలో కుటుంబ సభ్యులు విలువలే నట్లుగా ప్రవర్తిస్తున్నారనే నిరాశ భావనలు, చిన్నచిన్న సమ స్యలకే చికాకు, కోపం రావడం, సామాజిక అంశాలపై ఆశక్తి సన్నగిల్లడం నిద్ర సరిగా రాకపోవడం, తొందరగా నీరసం గా మారడం, అలసట అనిపించడం, కుటుంబ సభ్యులతో గొడవలు, వాగ్వివాదాలకు దిగడం, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుపు రావడం లాంటివి ముందుగానే సంకేతాలుగా కని పిస్తాయి. అలాంటి సమయాల్లో మీ ఆలోచనలను మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి.

మీ ఆలోచనలను మీ భాగస్వామి, ఇతర కుటుంబ సభ్యులకు మాటల ద్వారా వివరించండి. కుటుంబ సభ్యుల సహాయ సహాకారాలు ఎల్లప్పుడూ తీసుకోవడానికి ప్రయ త్నించండి. మీలోని భావనలను ఆలోచనలను కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. గృహిణిగా రోజూ చేయాల్సిన పనులను ఒక క్రమపద్ధతిలో రాసుకోవాలి, ఏ సమయానికి ఏ పనిని పూర్తిచేయాలో ఆ సమయానికి ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి, ఒక ప్రణాళికను తయారుచేసు కోవాలి. ఇరుగు పొరుగు, బంధువులు, కుటుంబ సభ్యులతో గడపడానికి, విశ్రాంతి తీసుకోవడం కోసం కొంత సమ యాన్ని కేటాయించుకోవాలి. వారానికి కనీసం ఒకసారైనా సరదాగా గడపడానికి షాపింగ్ లేదా స్నేహితులను కలుసుకోవడానికి ఇంటి నుండి బయటికి వెళ్లాలని గుర్తుంచుకోవాలి. అలాచేస్తే ఉత్సాహం రెట్టింపవుతుంది. మీరు ఇంటి బాధ్యతలను కొంత సమ యం పాటు మరిచిపోయి ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిం చాలి. రోజు కొంత సమయం వ్యాయామం చేయడం వలన డిప్రెషన్‌ను సమర్థవంతంగా నివారించవచ్చు. వ్యాయామం తో శారీరక శక్తి పెరుగడం, నీరసస్థాయి తగ్గడం జరుగు తుంది. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు నడిస్తే ప్రయోజనం బాగుంటుంది. రోజుకు 6 నుంచి 7 గంటల పాటు నిద్రించాలి. ప్రశాంతమైన నిద్ర వలన ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. నిద్ర వలన మెదడుకు విశ్రాంతి దొరుకు తుంది. మరునాడు  చేయాల్సిన పనులకు శక్తి వస్తుంది. ద్యానం, యోగా లేదా దీర్ఘ శ్వాస ప్రక్రియ వంటి టెక్ని క్స్ ద్వారా  డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశ మ నం లభిస్తుంది. డిప్రెషన్‌కు నుంచి ఉపశమనం పొందడా నికి, పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాని ఇది అసాధ్యం మాత్రం కాదు మీరు మీ జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానించడం, మీ ఇష్టమైన కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహాకారాలను తీసుకోవడం, కౌన్సెలింగ్ సైకోథెరపీలతో డిప్రెషన్‌ను తరిమికొట్టవచ్చు.
 డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి 
కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 
9703935321

Tags
English Title
The house lamp is illusions
Related News