ఏపీలో రాత్రి 12గం.వరకూ హోటల్స్

Updated By ManamMon, 10/15/2018 - 20:14
Hotels to remain open till midnight in Andhra pradesh
Hotels to remain open till midnight in Andhra pradesh

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో హోటల్స్, రెస్టారెంట్లు ఇక అర్థరాత్రి 12 గంటల వరకూ అందుబాటులో ఉండనున్నాయి. హోటల్స్, రెస్టారెంట్ల సమయాన్ని రాత్రి 10.30 గంటల నుంచి 12 గంటల వరకూ నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి జీవో ఎంఎస్ నెంబర్ 25 ద్వారా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏపీ హోటల్స్ అసోసియేషన్ విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై హోటల్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది

English Title
Hotels to remain open till midnight in Andhra pradesh
Related News