కడపలో ఘోర రోడ్డు ప్రమాదం

Updated By ManamFri, 08/10/2018 - 13:41
Horrific road accident In Kadapa

Horrific road accident In Kadapa

కడప: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముద్దనూరు మండలం తిమ్మాపురం వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్- ట్రాక్టర్ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో అదుపుతప్పిన టిప్పర్ అటుగా వెళ్తున్న కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. ఈ కారు కర్ణాటక నుంచి బల్లారికి వెళ్తున్నట్లుగా సమాచారం.

స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో చనిపోయిన వారు ఏ ప్రాంతానికి చెందిన వారు..? అనే విషయం తెలియరాలేదు. ఈ ప్రమాదం జరిగిన అనంతరం టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

English Title
Horrific road accident In Kadapa
Related News