హీరో బంగీ జంప్, వీడియో వైరల్..

Updated By ManamWed, 09/26/2018 - 19:04
Will Smith Bungee Jumps Out of a Helicopter
Will Smith Bungee Jumps Out of a Helicopter!

లాస్‌ ఏంజిల్స్: కొంతమంది వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటారు. పెరుగుతున్న వయసును మరిచిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. అందుకు హాలీవుడ్ హీరో విల్‌స్మిత్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హాఫ్ సెంచరీ కొట్టిన విల్‌స్మిత్ తన బర్త్‌డేను కుటుంబసభ్యుల మధ్య వినూత్నంగా జరుపుకున్నాడు. 

Will Smith Bungee Jumps Out of a Helicopter!

భార్య జాడ పింకెట్ స్మిత్, కూతురు విల్లో స్మిత్, కుమారుడు జాడెన్ స్మిత్‌ సమక్షంలో అతగాడు 50వ పుట్టినరోజు సందర్భంగా బంగీ జంప్ చేసి, సరదా తీర్చుకున్నాడు. గ్రాండ్ కెన్యాన్ లోయ ప్రాంతంలో హెలికాప్టర్‌పై నుంచి బంగీ జంప్ చేసిన విల్‌స్మిత్‌కు ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్టు కూడా లభించింది. 550 అడుగుల ఎత్తుపై నుంచి 200 అడుగుల వరకు బంగీ జంప్ చేశాడు. ఈ సందర్భంగా విల్ స్మిత్ తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోతో పాటు, బంగీ జంప్ వీడియోను యూ ట్యూబ్‌లో షేర్ చేయగా, అవి వైరల్‌గా మారాయి.

English Title
Hollywood Hero Will Smith Bungee Jumps Out of a Helicopter!
Related News