కోమటిరెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో స్వల్ప ఊరట

Updated By ManamMon, 03/19/2018 - 16:40
mla

komatireddyహైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేల శాసనసభ్యత రద్దు కేసుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 6వారాల పాటు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఎన్నికల సంఘానికి కోర్టు ఆదేశాలిచ్చింది. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనర్హులని తెలిసింది. ఇదిలా ఉంటే కోర్టు ఈ కేసుకు సంబంధించి శాసనసభలోని ఒరిజినల్ సీసీ ఫుటేజీలను సమర్పించాలని ఆదేశించింది. శాసనసభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పైకి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మైక్‌‌ను విసిరేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో స్వామిగౌడ్ కంటికి గాయమైంది. ఈ నేపథ్యంలోనే ఆ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు శాసనసభ స్పీకర్. దీంతో స్పీకర్ మధుసూదనా చారి వారిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేశారు. అంతేగాకుండా కాంగ్రెస్ సభ్యులందరిపైనా సస్పెన్షన్ విధించారు.

English Title
high court interim stay on mlas disqualification case
Related News