లక్ష్మీ పార్వతి పాత్రకు హీరోయిన్ ఖరారు..?

Updated By ManamMon, 11/05/2018 - 12:41
Rupali Suri

Rupali Suriదివంగత మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ జీవితకథ ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుండగా.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి పాత్రలలో ఎవరూ నటిస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మీ పార్వతి పాత్రకు హీరోయిన్‌ ఖరారు అయినట్లు తెలుస్తోంది.

మోడల్ రుపాలి సూరిని లక్ష్మీ పార్వతి పాత్ర కోసం వర్మ ఎంపిక చేసినట్లు సమాచారం. ముంబయికి చెందిన రూపాలి డ్యాడ్ హోల్డ్ మై హ్యాండ్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చాక ఎలాంటి సంఘటనలు జరిగాయన్న విషయాలను వర్మ ఈ చిత్రంలో చూపించనున్నారు. సతీశ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Heroine final for Lakshmi's NTR..?
Related News