ఫైనల్ కాపీ చూసేశాం.. సెలబ్రేషన్స్ స్టార్ట్

Updated By ManamMon, 10/15/2018 - 12:40
Hello Guru Prema Kosame

Hello Guru Prema Kosameరామ్ హీరోగా నేను లోకల్ ఫేమ్ త్రినాథరావు తెరకెక్కించిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. అనుపమ పరమేశ్వరన్, ప్రకాశ్ రాజ్, ప్రణీత తదితరులు ముఖ్యపాత్రలలో నటించిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం ఫైనల్ కాపీ రెడీ అవ్వగా.. దాన్ని చూసిన చిత్ర యూనిట్ సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చిత్రం హిట్ గ్యారెంటీ అంటూ అప్పుడే సెలబ్రేషన్స్‌ను కూడా ప్రారంభించేసింది.

ఈ విషయాన్ని ఆ చిత్ర మాటల రచయిత ప్రసన్న కుమార్ సోషల్ మీడియాలో తెలుపుతూ.. ‘‘సినిమా ఫైనల్ కాపీ చూసేశాం. సెలబ్రేషన్స్ స్టార్ట్. ఈ సారి దసరా.. క్యాలెండర్‌లో, థియేటర్లో ఒకేసారి వస్తుంది. హలో గురు ప్రేమ కోసమే అక్టోబర్ 18న రానుంది’’ అంటూ కామెంట్ పెట్టాడు. ఈ సందర్భంగా వారి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఓ ఫొటోను కూడా షేర్ చేసుకున్నాడు. అందులో దర్శకుడు త్రినాథరావు, నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌లు కూడా ఉన్నారు.

 

English Title
Hello Guru Prema Kosame team celebrations before movie release
Related News