తనొక న్యూ ఏజ్ ఫిలిమ్ మేకర్ 

Updated By ManamFri, 11/02/2018 - 01:36
naga chaitanya

నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సవ్యసాచి’ చందు మొండేటి దర్శకుడు. నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్(సి.వి.ఎం) నిర్మాతలు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా నాగ చైతన్య ఇంటర్వ్యూ...

image‘సవ్యసాచి’ జర్నీ ఎలా ప్రారంభమైంది?
 ‘ప్రేమమ్’ సినిమాను నార్వేలో చిత్రీకరిస్తున్నప్పుడు డైరెక్టర్ చందు మొండేటి ‘సవ్యసాచి’లో మెయిన్ పాయింట్‌ను 5-10 నిమిషాల పాటు వివరించారు. ఇలాంటి పాయింట్‌తో సినిమా చేస్తే మరీ ఎక్స్‌పెరిమెంట్ అవుతుందేమోనని తనతో అన్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత చందు పూర్తి కథను కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా బాగా అనిపించింది. అలా జర్నీ స్టార్ట్ అయ్యింది. చందు ఆలోచనా ధోరణిని నేను బాగా ఇష్టపడతాను. తన మీద నమ్మకంతోనే ఈ సినిమా చేస్తున్నా. ‘ప్రేమమ్’  రీమేక్ చేయవద్దని చాలా మంది  చెప్పారు. కానీ పాయింట్‌ని చందు చక్కగా డీల్ చేశాడు. తెలుగు ఆడియెన్స్‌కు తగినట్లు బాగా బ్లెండ్ చేశాడు. నా దృష్టిలో తను న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్. ఒకటీ, రెండు షెడ్యూళ్ల వరకు కాస్త ఎలా ఉంటుందోనని అనిపించింది. కానీ ఆ తర్వాత చందుపై నమ్మకంతో ఆలోచించలేదు.

 స్క్రిప్ట్‌లో మీ ఇన్‌వాల్వ్‌మెంట్ ఎంత వరకు ఉంటుంది?
- స్క్రిప్ట్ రెడీ తయారవుతున్న దశలో ఇన్‌వాల్వ్ అవుతాను. ప్రతి స్క్రిప్ట్ వింటాను. ఏది మంచి, ఏది చెడు అని ఆలోచి స్తాను. కానీ ఒక లైన్ దాటి మనం వెళ్లకూడదని మాత్రం అనుకుంటా. దర్శకుడికి మనం ఇచ్చే రెస్పెక్ట్ అక్కడే తెలుస్తుంది. 

వానిష్ సిండ్రోమ్ గురించి మీకు ముందే తెలుసా?
- లేదండీ. కాకపోతే ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత నేను దాని గురించి ఆలోచించా. యూట్యూబ్ లోనూ, న్యూస్ పేపర్లలోనూ చూసి తెలుసుకున్నా. ట్విన్స్‌లో ఒకరు వానిష్ అయిపోతే ఆ లక్షణాలు మరొకరి వస్తాయి. అందుకనే ఉన్న వ్యక్తి ఒకలా ప్రవరిస్తారు. ఒకే శరీరంలో ఇద్దరు వ్యక్తులున్న ఫీలింగ్ కలుగుతుంది. మా సినిమాలో హీరో ఎడమ చేయి మరో వ్యక్తిలా ప్రవర్తిస్తుంటుంది. కంట్రోల్ ఉండదు. 

స్క్రిప్ట్ సెలక్షన్‌లో ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ న్నట్టేనా?
- కెరీర్ 
స్టార్టింగ్ లో కొన్ని సినిమాల స్క్రిప్ట్ లు నాన్నగారు విన్నారు. ఆ తర్వాత అంతా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ‘సవ్యసాచి’image రిలీజ్‌కి ముందు ఎడిటింగ్ రూమ్‌లో చూసి కొన్ని చిన్న చిన్న సలహాలు చెప్పేవారు. ఈ సినిమాకు కూడా చెప్పారు. చిన్న చిన్న భావోద్వేగాలకు సంబంధించినవి.

నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ గురించి చెప్పండి?
- కథను నమ్మి మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేసే నిర్మాతలున్న సంస్థ మైత్రీ మూవీస్. వీరి కారణంగా మా సినిమా స్పాన్ ఎంతో పెరిగింది. మాధవన్ గారిని, భూమికగారిని సజెస్ట్ చేసింది కూడా వాళ్లే.
మాధవన్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?
 మాధవన్‌గారు ఇప్పటికీ ట్రెండ్ సెట్టరే.  ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. సెట్‌కీ నా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చి, ఆయనతో ఫొటోలు తీసుకున్నారు.  ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నా.

హీరోయిన్ నిధి గురించి...?
- నిధి చాలా టాలెంటెడ్. యాక్టివ్ గర్ల్. ఆల్ రౌండర్. డ్యాన్సులు చేయగలదు. ఇలాంటి సినిమాల్లో ఫ్రెష్ ఫేస్‌లు క్లిక్ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువ. అందుకే తనని సెలక్ట్ చేసుకున్నాం.

తదుపరి చిత్రాలు..? 
- ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నా..ఇంకా టైటిల్ అనుకోలేదు. సినిమాలో కూడా నేను, సామ్ ప్ళ్లై.. నిత్యం గొడవపడే జంటగా కనపడతాం. నిజ జీవితంలో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు లేవు. సో సెట్లో నటిస్తున్నాం. ఇద్దరం కలిసి సినిమా చేయడం వల్ల మామూలు కంటే ఎక్కువ సమయాన్ని గడపడానికి వీలవుతోంది. ఎవరినీ ఎవరూ డామినేట్  చేయకుండా నటిస్తున్నాం. సమ్మర్‌కి విడుదలవుతుంది. మరో వైపు వెంకీమామ సినిమా డిసెంబర్ నుంచి మొదల వుతుంది. 

English Title
He is a New Age Filmmaker
Related News