కరీంనగర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో

Updated By ManamWed, 07/11/2018 - 22:13
hdfc

hdfcహైదరాబాద్: జీవిత బీమాయేుతర కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్స్యూరెన్స్ బుధవారం కరీంనగర్‌లో నూతన శాఖను ప్రారంభించింది. దీంతో తెలంగాణలో ఈ కంపెనీ శాఖల సంఖ్య మూడుకు చేరింది. టైర్2, టైర్3 పట్టణాల్లో శాఖలను విస్తరించడంలో భాగంగా కరీంనగర్‌లో నూతన శాఖను ప్రారంభించడం ఆనందంగా ఉందని ప్రారంభోత్సవ వేడుకల్లో హెచ్‌డీఎఫ్‌సీ జనరల్ ఇన్స్యూరెన్స్ సి.ఇ.వో, ఎం.డి రితేష్ కుమార్ అన్నారు. దీని ద్వారా ఎక్కువ మంది వినియోగదార్లను చేరుకోగలమని ఆయన తెలిపారు. ఎర్గో జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ మొత్తం 106 పట్టణాల్లో 122 శాఖలను నిర్వహిస్తోంది. 

Tags
English Title
HDFC Ergo in Karimnagar
Related News