ఐబీఎం ప్రోడక్ట్స్ కొంటున్న హెచ్‌సీఎల్

ఐబీఎం ప్రోడక్ట్స్ కొంటున్న హెచ్‌సీఎల్
  • లావాదేవీ విలువ 1.8 బిలియన్ డాలర్లు

న్యూఢిల్లీ: కొన్ని ఎంపిక చేసిన  ఐబీఎం  సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను 1.8 బిలియన్ డాలర్లకు కైవసం చేసుకోనుంది. రెగ్యులేటరీ ఆమోదాల తర్వాత, ఈ లావాదేవీ 2019 మధ్యనాటికి ముగుస్తుందని భావిస్తున్నారు. హెచ్‌సీఎల్ స్వాధీనం చేసుకోనున్న సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులకు మొత్తం 50 బిలియన్ డాలర్ల మార్కెట్ అందుబాటులో ఉందని చెబుతున్నారు. సెక్యూర్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌కు చెందిన యాప్‌స్కాన్, సెక్యూర్ డివైస్ మేనేజ్‌మెంట్‌కు బిగ్‌ఫిక్స్, మార్కెటింగ్ ఆటోవేుషన్‌కు యునిక, ఆమ్మి-చానల్ ఈ-కామర్స్‌కు కామర్స్, డిజిటల్ ఎక్స్పీరియన్స్ పోర్టల్, ఈ-మెయిల్, లో-కోడ్ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌కు నోట్స్ అండ్ డామినో, వర్క్‌స్ట్రీమ్ కొలాబరేషన్‌కు కనెక్షన్లు వంటివి ఆ ఉత్పత్తులలో ఉన్నాయి. ఈ ఉత్పత్తులలో ఐదింటికి సంబంధించి హెచ్‌సీఎల్-ఐబీఎం మధ్య ప్రస్తుతం మేధా ఆస్తి భాగస్వామ్యం కొనసాగుతోంది. 

‘‘మా మోడ్-3 (ప్రాడక్టులు-ప్లాట్‌ఫాంలు) ఆఫరింగ్‌లను పెంపొందించుకునే విధంగా మార్కెట్‌లో మేం గొప్ప అవకాశాలను చూడడం కొనసాగుతోంది. మేం స్వాధీనం చేసుకుంటున్న ఉత్పత్తులు హెచ్.సి.ఎల్‌కు వ్యూహాత్మక విభాగాైలెన సెక్యూరిటీ, మార్కెటింగ్, కామర్స్ వంటి వృద్ధి చెందుతున్న పెద్ద మార్కెట్లలో ఉన్నాయి. వీటిలో చాలా భాగం ఉత్పత్తులు క్లయింట్ల నుంచి గొప్ప ఆదరణను చూరగొంటున్నాయి. పరిశ్రమ ఎనలిస్టులు టాప్ నాలుగులో వాటిని ఉంచుతారు’’ అని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధ్యక్షుడు, సీఈవో సి. విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 

‘ఎంపిక చేసిన ఉత్పత్తుల్లో ఉన్న పరస్పర సహకారం, మార్కెటింగ్, కామర్స్ సాఫ్ట్‌వేర్ ఆస్తులను విస్తరింపజేసుకునేందుకు ఇది సరైన సవుయుమని మేం భావిస్తున్నాం. వాటిని రానురాను ఒంటరి ఉత్పత్తులుగా అందజేయడం పెరుగుతోంది. అదే సవుయంలో, ఈ ఉత్పత్తులు హెచ్‌సీఎల్‌కు పటిష్టైమెన వ్యూహపరంగా అతికినట్లుగా సరిపోతాయని మేం భావిస్తున్నాం. హెచ్‌సీఎల్ దాని కస్టమర్లకు నవకల్పనలు, వృద్ధిని తెచ్చిపెట్టేందుకు సరైన స్థితిలో ఉంది’ అని ఐబీఎంలో కాగ్నిటీవ్ సొల్యూషన్స్ అండ్ రిసెర్చ్ విభాగ సీనియర్ ఉపాధ్యక్షుడు జాన్ కెల్లీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు