ఇదే జోరును కొనసాగించాలి

sardar
  • మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్

ముంబై: భువనేశ్వర్‌లో జరుగుతున్న పురుషుల హాకీ వరల్డ్‌కప్‌లో భారత హాకీ జట్టు అద్భుతమైన ప్రదర్శనను కొనకసాగింతుందని, తర్వాత జరగబోయే మ్యాచ్‌ల్లో కూడా ఇదే జోరును కొనసాగించాలని భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ తెలిపాడు. ‘ పురుషుల హాకీ వరల్డ్‌కప్‌లో భారత్ అద్భుతమైన శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు బెల్జియం, హోలాండ్, జర్మనీ, అర్జెంటీనా, ఆస్ట్రేలియాలు బలమైన జట్లు. ఈ టోర్నీలో భారత్ ఇదే జోరును కొనసాగించాలి’ అని సర్దార్ అన్నాడు. హాకీ వరల్డ్‌కప్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 5-0తో విజయం సాధించగా... బె ల్జియంతో జరిగిన మ్యాచ్‌లో 2-2తో డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్ రేపు జరగబోయే మ్యాచ్‌లో కెనడాతో పోటీపడనుంది.  ‘ వరల్డ్‌కప్, ఒలింపిక్స్ లాంటి టోర్నీలు నాలుగు సంవత్సరాలకొకసారి మాత్రమే వస్తాయి. వీటి కోసం మేము నిరంతరం ప్రిపేర్ అవుతూనే ఉంటాం. మా అసలైన మ్యాచ్ క్వార్టర్స్‌లో ఉంటుంది. మన్‌ప్రీత్ సింగ్, పిఆర్ శ్రీజేష్ సామర్థ్యాలు గురించి నాకు బాగా తెలుసు. క్వార్టర్స్‌లో ఇద్దరూ, ముగ్గురూ ఆటగాళ్ల ఆట మ్యాచ్ స్వరూపాన్నే మార్చవచ్చు. ఆటగాళ్లు క్వార్టర్స్‌లో పూర్తి ఏకాగ్రతతో ఆడతారు’ అని సర్దార్ చెప్పాడు.

Tags

సంబంధిత వార్తలు