తెలంగాణకు హరితహారం

Updated By ManamFri, 11/09/2018 - 01:46
Harithaharam

imageతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున మొక్కల పెంపకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతూ ‘తెలంగాణకు హరితహారం’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలో వాహన కాలుష్యం పెరిగిపోతుండటంతో దాన్ని అరికట్టడానికి మొక్కల పెంపకమే ఏకైక మార్గమని భావించిన జీహెచ్‌ఎంసీ తాను సైతం ఈ బృహత్‌కార్యక్రమంలో పాలు పంచుకోవాలని నిర్ణయించింది. 2016 జూలై 11వ తేదీన ఒక్కరోజే నగరవ్యాప్తంగా 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. నగరంలో ఉన్న జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, సామాజిక అటవీ విభాగాలకు  చెందిన 87 నర్సరీల నుంచి ముందుగా 30లక్షల మొక్కలను ముందస్తు ప్రణాళికలో భాగంగా సేకరించారు. మొక్కలు ఎక్కడెక్కడ నాటించాలో ముందుగానే గుర్తించారు. వివిధ కాలనీలలో అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రోడ్లలోని డివైడర్ల మీద కూడా మొక్కలు నాటేందుకు అంతా రంగం సిద్ధం చేశారు. ప్రతి ప్రాంతానికీ ఒక సీనియర్ అధికారిని నోడల్ అధికారిగా నియమించారు.

ముందుగానే షార్ట్ ఫిలింలు, ప్రకటనలు, ఇతర రూపాలలో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజలు, విద్యార్థులు, imageస్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలన్నింటినీ ఈ కార్యక్రమంలో భాగంగా చేసి, దీన్ని ఓ పెద్ద ప్రజా ఉద్యమంగా తయారు చేశారు. గ్రీన్‌హైదరాబాద్. సీజీజీ.జీవోవీ.ఇన్ అనే పేరుతో ప్రత్యేకంగా ఇందుకోసం ఒక వెబ్‌సైట్‌ను కూడా తయారుచేయించారు. అందులో వివిధ అధికారుల వివరాలు, ప్రాంతాలు, నర్సరీలు, కాంటాక్ట్ నంబర్లు, గోతులు ఎలా తవ్వాలో, వాటిలో మొక్కలు ఎలా నాటాలో, ఎరువులు ఎంతవరకు వేయాలో అనే విషయాల గురించిన సూచనలు అన్నీ ఉంచారు.

దాదాపు 40 వేల మంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాల వారు, వలంటీర్లు, విద్యార్థులతో పాటు 104 సంస్థలు భాగస్వామ్యం వహించడంతో ఆ కార్యక్రమం భారీగా విజయవంతం అయ్యింది. మొత్తం 193 రకాల మొక్కలను 4173 ప్రదేశాలలో నాటారు. నిజానికి 25 లక్షల మొక్కలనే నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నా, దాన్ని అధిగమించి.. మొత్తం 29.19 లక్షల మొక్కలను ఆ ఒక్కరోజులోనే నాటడం ద్వారా రికార్డు నెలకొల్పారు. 2017-18 సంవత్సరం మొత్తమ్మీద కలిపి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నగర పరిధిలో విజయవంతంగా 76.91 లక్షల 
మొక్కలను నాటడం విశేషం. 

English Title
harithaharam
Related News