కేసీఆర్ చేతిలో హరీష్ జాతకం

Updated By ManamFri, 11/09/2018 - 01:21
Revanth
  • మామ మెప్పు కొరకే బాబుపై విమర్శలు

  • టీఆర్‌ఎస్‌లో కొట్లాటలు,పంచాయితీలు

  • మా గెలుపు ఎప్పుడో ఖాయమైంది: రేవంత్ రెడ్డి

imageన్యూఢిల్లీ: కాంగ్రెస్, టీడీపీ, ఇతర భాగస్వామ్య పక్షాలు మహా కూటమిగా ఏర్పడటంపై మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమది ప్రజాకూటమి అని, దానికి వ్యతిరేకంగా హరీశ్‌రావు రకరకాలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీల్డ్‌కవర్ సీఎం కావాలా? అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకునే సీఎం ఎంపిక జరుగుతుందనేది గత చరిత్ర చూస్తే ఎవరికైనా అర్థమవుతుందన్నారు. టీఆర్‌ఎస్‌లో సీఎంనే కాదు.. కనీసం మంత్రులను నిర్ణయించేటప్పుడు ఎవరి అభిప్రాయమైనా తీసుకుంటారా? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. కుటుంబంలో ఉన్న వ్యక్తులు అన్ని పదవులనూ పంచుకుని ఏమైనా మిగిలితే ఇతరులకు ఇస్తున్నారని విమర్శిం చారు. హరీశ్రావును సీఎం కేసీఆర్ నమ్మరని వ్యాఖ్యానించారు. దిల్లీలో కాంగ్రెస్ సీట్ల కేటా యింపుపై కసరత్తు జరుగుతున్న వేళ ఆయన మీడియాతో మాట్లాడుతూ హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

హరీశ్ జాతకమంతా కేసీఆర్‌కు తెలుసు!
‘‘హరీశ్‌రావు నిప్పుల్లో నడిచినా తన శీలాన్ని నిరూపించుకోలేరు. ఆయనను కేసీఆర్ నమ్మరు. హరీశ్ ఎలాంటి వ్యక్తో, నమ్మినవాళ్లను ఎలా మోసం చేశారో అతని మామ కేసీఆర్‌కు తెలుసు. అతని జాతకమంతా కేసీఆర్ వద్ద ఉంది. కేసీఆర్‌ను నమ్మించేందుకు కాంగ్రెస్‌ను, కూటమిని హరీశ్ పదేపదే విమర్శిస్తున్నారు. ఈరోజు కూడా లేఖ రాశారని తెలిసింది. గత నెల 25న సాయంత్రం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వేల్లో నర్సారెడ్డిని కారులో ఎక్కించుకొని రాత్రి 9.30గంటలకు హరీశ్ నివాసానికి తీసుకెళ్లారు. మూడు గంటల పాటు చర్చించారు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే నర్సారెడ్డి ఢిల్లీ వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న నర్సారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియామకమైన తర్వాత కూడా హరీశ్‌ను కలిసిన తెల్లవారే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

దానికి కారణమేంటో వాళ్లకే తెలియాలి. హరీశ్, కేసీఆర్ మధ్య సంబంధాలు ఉప్పు, నిప్పులా ఉన్నాయా? తుపానుకు ముందు వచ్చే ప్రశాంతతలా ఉందా? విచ్ఛిన్నమయ్యే ముందు నిశ్శబ్ధమా? ఈ విషయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలి అని రేవంత్ అన్నారు. మంత్రుల క్వార్టర్స్ వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలన్నీ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. 25న సాయంత్రం 7గంటల నుంచి 9 గంటల వరకు హరీశ్‌రావు నివాసం లోకి వెళ్లిన కార్లు, వచ్చిన కార్లు, వాటిలో ఎవరెవరు వచ్చివెళ్లారో వెల్లడిస్తే కేసీఆర్, కేటీఆర్‌తో పాటు తెలంగాణ సమాజానికీ ఓ స్పష్టత వస్తుంది’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ను సంతోష పెట్టడానికే బాబుపై విమర్శలు
‘‘ఏదైనా రహస్యంగా జరుగుతున్నప్పుడు జరగనీ అనుకుంటాం. కానీ కాంగ్రెస్-టీడీపీ కలయికను ఇదొక తెలంగాణ వ్యతిరేక కలియిక అని, ప్రాజెక్టులకు వ్యతిరే కంగా చంద్రబాబు లేఖలు రాశారని ప్రచారం కల్పించి రాజకీయ లబ్ధి పొందాలని హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నా రు. గోదావరి, కృష్ణా జలాల విషయంలో భౌగోళికంగా తెలంగాణ ఎగువున ఉండగా, ఏపీ దిగువన ఉంది. చట్టబద్ధంగా తెలంగాణ నీరు వదిలితేనే అవి ఏపీకి పోతాయి. ఏపీ ప్రజలు తెలంగాణ నీళ్లను ఆపలేరు. గోదావరి జలాలను మహారాష్ట్ర ప్రభుత్వం, కృష్ణా జలాలను కర్ణాటక ఆపగలదు.

ఒకవేళ ఏపీ.. కేంద్ర జలవనరుల శాఖకు లేఖలు రాసినా అవి చట్టబద్ధంగా ఉన్నాయో లేదో న్యాయపరంగా సమీక్షించాకే నిర్ణయాలు తీసుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు తమ హక్కుగా వచ్చే నీటి వినియోగాన్ని చట్టబద్ధంగా విని యోగించుకుంటున్నప్పుడు ఏపీ అధికారులు కేంద్రానికి లేఖలు రాసినా, కోర్టులకు వెళ్లి కేసులు వేసినా ఫలితముండదు. ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీ సీఎంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే లేఖలు రాస్తే రాసి ఉండొచ్చని, ఆ పరిస్థితుల్ని తాము అర్థం చేసుకోగల మని, ఆ లేఖలతో తమకేం ఇబ్బందిలేదని అన్నారు. కానీ చంద్రబాబు లేఖలతో తెలంగాణకు ఏదో నష్టం జరిగిపోతోందని హరీశ్ అపోహలు సృష్టించ డానికి చేసే ప్రయత్నమంతా కేవలం కేసీఆర్‌ను సంతోషపెట్టడానికే’’ అని రేవంత్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

English Title
Harish's horoscope in KCR hands
Related News