ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా హ్యాపీ వెడ్డింగ్

Updated By ManamWed, 06/13/2018 - 23:35
image

imageసుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా యు.వి. క్రియేషన్స్, పాకెట్ సినిమా పతాకాలపై లక్ష్మణ్ కార్య దర్వకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. మ్యూజికల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి తమన్ నేతృత్వంలో రీ-రికార్డింగ్ జరుగుతోంది. ‘ఫిదా’ వంటి మ్యూజిక్ హిట్‌ని అందించిన శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విజయాలు సాధిస్తున్న క్రేజీ బ్యానర్ యు వి క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి మేము ‘హ్యాపి వెడ్డింగ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. రోమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌లో వుంది. పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జరిగే రోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా మా దర్శకుడు తెరకెక్కించారు’’ అన్నారు.

English Title
Happy Wedding as a Family Entertainer
Related News