హ్యాండిల్ విత్ కేర్

Manu Bhaker
  • యువ షూటర్లపై అభినవ్ బింద్రా

ముంబై: జాతీయ అంతర్జాతీయ వేదికల్లో సత్తా చాటుతున్న భారత యువ షూటర్లను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని మాజీ షూటర్ అభినవ్ బింద్రా అన్నారు. ఇషా సింగ్ వయసు 13 ఏళ్లు. ఈ అమ్మాయి నిలకడగా రాణిస్తోంది. ఇక యువ షూటర్లయిన మను భకర్, హీనా సిద్ధు ఇటీవల కేరళలో జరిగిన జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో సీనియర్ కేటగిరిలో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణాలు సాధించారు. ఇది వేరే అంశం. అయితే 16 ఏళ్ల భకర్ అంతర్జాతీయ వేదికల్లో సత్తా చాటి తన రాకను తెలియజేసింది. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్, యూత్ ఒలింపిక్స్, ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లలో పసిడి పతకాలు గెలిచింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో హరియాణాకు చెంది న 16 ఏళ్ల ఆదర్శ్ సింగ్ కూడా రాణించాడు. మరో చిచ్చర పిడుగు అనీష్ భన్వాలా 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ సత్తా చాటాడు. దీన్ని బట్టి చూస్తే భారత్‌లో షూటింగ్ ఆరోగ్యకరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ‘వా ళ్లు యువ అథ్లెట్లు. ఈ దశలో వాళ్ల కెరీర్ చాలా సున్నితంగా ఉంటుంది. వాళ్ల ట్రెయినింగ్‌ను సమతుల్యంగా రూపొందించాలి. ఇంకా అనేక అంశా ల్లోనూ వాళ్లను సున్నితంగా మేనేజ్ చేయాలి’ అని బింద్రా అన్నారు.

సంబంధిత వార్తలు