కాస్మోస్ బ్యాంకుకు హ్యాకర్ల దెబ్బ

Updated By ManamWed, 08/15/2018 - 02:28
cosmos
  • ఏటీఎం స్విచ్ సర్వర్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

  • రుపే, డెబిట్ కార్డులు వివరాలు సేకరణ

  • దాదాపు రూ.94 కోట్లు అక్రమంగా తరలింపు

  • ఇందులో 78 కోట్ల లావాదేవీలు విదేశాల్లోనే

  • హాంగ్‌కాంగ్‌లోని బ్యాంకు ఖాతాలో 12 కోట్లు 

  • ఇది కెనడా సైబర్ నేరస్థుల పనే: బ్యాంక్ చైర్మన్

  • విచారణ ప్రారంభించిన పుణె సైబర్ పోలీసులు

imageపుణె: క్రెడిట్, డెబిట్ కార్డులను క్లోనింగ్ చేసి పెద్ద మొత్తంలో సొమ్మును విత్ డ్రా చేసుకున్న ఘటనలు చూశాం! ఫోన్ చేసి మేం మీ బ్యాంకు ఉన్నతాధికారులం మాట్లాడుతున్నామని పేర్కొంటూ డెబిట్ కార్డులు వివరాలు తెలుసుకుని డబ్బులు తరలించిన ఘటనలనూ చూశాం! కానీ.. హ్యాకర్లు మరిం త తెలివిమీరిపోయారు. ఏకంగా ఓ బ్యాంకు ఖాతాదారుల ఏటీఎం కార్డుల వివ రాలను హ్యాక్ చేసి ఏకంగా రూ. 94 కోట్లు తరలించారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన పుణెలోని కాస్మోస్ బ్యాంకులో చోటు చేసుకుంది.

ఈ బ్యాంకుకు చెందిన వీసా, రుపే కార్డుల వివరాలను చోరీ చేసి విదేశాల్లోని బ్యాంకులకు తరలించారు. కాస్మోస్ బ్యాంకు ఏటీఎం స్విచ్ సర్వర్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు... రుపే, వీసా కార్డుదారుల వివరాలను దొంగిలించారు. వారి ఖాతాల నుంచి రూ.94 కోట్లు తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. ఈ మేరకు 12 వేల ట్రాన్సాక్షన్లు నిర్వహించినట్లుగా గుర్తించారు. ఈ ట్రాన్సాక్షన్లీ విదేశాల నుంచే జరిగినవి కావడం గమనార్హం. అలాగే.. మరో 2,800 ట్రాన్సాక్షన్లు భారత్‌లోప ల జరిగాయి. ఈ ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.80 లక్షల సొమ్మును తరలించారు.
 

English Title
Hackers blow to Cosmos bank
Related News