పెదవి దాటని మాటొకటుంది

Updated By ManamWed, 07/18/2018 - 23:43
image

imageఫిల్మ్ మాంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం ‘పెదవి దాటని మాటొకటుంది’. అదితి, టి.జి. కీర్తి కుమార్ నిర్మాతలు. టి.గురుప్రసాద్ దర్శకుడు. రావన్ రెడ్డి, పాయల్ వాద్వా, డా. వి.కె.నరేశ్, మొయిన్, మౌరిస్ సడిచె, నందు కుమార్, మోహన్ భగత్, ప్రియాంక శుక్ల కీలక పాత్రధారులు. ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు టి.గురుప్రసాద్  మాట్లాడుతూ ‘‘నారాయణలో గోడలు దూకి సినిమాలు చూసే మేం ముగ్గురం (హీరో, సంగీత దర్శకుడు) ఈ సినిమా చేశాం.

నేను ఏం చెప్పినా మా వాళ్లు నమ్మి మాతో ఉన్నారు. మా నిర్మాతలు నాకు అమ్మానాన్నల్లాంటివారు. 30 రోజుల్లో సక్సెస్‌ఫుల్‌గా సినిమాను పూర్తి చేశాం. 75 సీన్లు, నాలుగు పాటలుంటాయి. ఇందులో నరేశ్‌గారి పాత్ర చాలా స్పెషల్. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. హీరోయిన్ పాయల్ వాద్వా మాట్లాడుతూ ‘‘మాది ఢిల్లీ. ఈ సినిమా  యూనిట్ మొత్తం చాలా ఓపిగ్గా నాతో పనిచేయించుకున్నారు. మంచి సినిమా అవుతుంది’’ అన్నారు. హీరో రావన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘దర్శకుడు మా ఫ్రెండ్ అనడం కన్నా.. తనకేం కావాలో తెలిసిన వ్యక్తి. కెమెరామేన్, ఎడిటర్... ఇలా అందరూ కలిసి ఈ సినిమా కోసం కృషి చేశారు. మా నిర్మాతలు మా కన్నా నన్ను ఎక్కువగా నమ్మారు. మేం అందరం కలిసి హిట్ సినిమాకు పనిచేశాం’’ అన్నారు.

నిర్మాత టి.జి . కీర్తి కుమార్ మాట్లాడుతూ ‘‘జెన్యూన్ టీమ్ చేసిన కృషి ఇది. ఐదేళ్లుగా మా టీమ్ అందరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఫాంటసీ రొమ్ కామ్ సినిమా ఇది. సేమ్ టీమ్‌తో ఇంకో సినిమా చేస్తాం. త్వరలోనే ప్రారంభిస్తాం. ఇందులో మా దర్శకుడు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు’’ అని చెప్పారు. నిర్మాత అదితి మాట్లాడుతూ ‘‘ఫ్యామిలీలాగా అందరం కలిసి పనిచేశాం. ఏడాది కష్టపడి చేసిన సినిమా ఇది’’ అన్నారు. సంగీత దర్శకుడు మాట్లాడుతూ ‘‘హీరో, నేను, దర్శకుడు నెల్లూరు నుంచి ఫ్రెండ్స్. కలిసి ఈ సినిమా చేశాం. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. 

English Title
guruprasad's movie 'pedavi daatani maatokatundi'




Related News