కార్పొరేట్‌కు ధీటుగా గిరిజన విద్యాసంస్థలు

Updated By ManamThu, 06/14/2018 - 06:45
chandulal
  • పాఠశాల స్థాయి నుంచే త్వరలో ప్రత్యేక శిక్షణ  

  • ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్‌లో ప్రవేశం పొందిన గిరిజన విద్యార్థులకు మంత్రి చందూలాల్ సత్కారం

imageహైదరాబాద్: గిరిజన విద్యాసంస్థల్లో కార్పొరేట్ కళాశాల స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ అన్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రవేశం పొందిన గిరిజన విద్యా సంస్థల విద్యార్థులను బుధవారం సచివాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గిరిజన విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జాతీయ సంస్థల్లో గిరిజన విద్యార్థులు ప్రవేశం పొందేలా ఉన్నత పాఠశాల స్థాయినుంచే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు.

నిపుణులైన ఉపాధ్యాయులను ఎంపిక చేసి విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్నారు. గతేడాది 47 మంది జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రవేశం పొందగా ఇటీవల జరిగిన ఐఐటీ పరీక్షలో గిరిజన విభాగంలో వందలోపు మూడు ర్యాంకులను తెలంగాణ విద్యార్థులు సాధించడం గొప్ప విష యమని కొనియాడారు. దీంతోపాటు 24 మంది గిరిజన విద్యార్థులు నీట్ పరీక్షలో మంచి ర్యాంకును సాధించి డాక్టర్లు కాబోతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కేంద్రాల్లో పాఠశాల, కళాశాల ఎక్సలెన్సీ కేంద్రా లున్నాయని, భవిష్యత్తులో పాత జిల్లా కేంద్రాల్లోను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. గిరిజన విద్యార్థుల సంక్షేమా నికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.

గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న విద్యాలయాల్లో చదువుతున్న పేద గిరిజన విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యంతోపాటు వైద్య సదుపాయాలను కూడా ప్రభుత్వమే కల్పిస్తుందని తెలిపారు. ఇతర దేశాల్లో ఉన్నత విద్యాభాసం చేసే విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నామని తెలిపారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు యాభై వేల నగదు బహుమతితోపాటు ల్యాప్‌టాప్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, జాయింట్ డైరెక్టర్ నికోలస్ పాల్గొన్నారు. 

English Title
gurukulam
Related News