అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఐదుగురి మృతి

Updated By ManamThu, 09/13/2018 - 12:26
America

Americaకాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని బేకర్స్‌ ఫీల్డ్‌ సిటీలో తుపాకీతో వచ్చిన ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతడి భార్య సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం తనని తాను కాల్చుకొని అతడు అక్కడికక్కడే మరణించాడు. బేకర్స్‌ఫీల్డ్‌లోని ఓ ట్రెక్కింగ్‌ కంపెనీ వద్ద ఈ ఘటన జరిగినట్లు కెర్న్‌ కౌంటీ అనే సంస్థ వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే వారం వ్యవధిలో అమెరికాలో కాల్పుల జరగడం ఇది రెండోసారి. ఐదురోజుల క్రితం సిన్సినాటిలోని ఓ బ్యాంకు వద్ద దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. వారిలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్వీరాజ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉన్న విషయం తెలిసిందే.

English Title
Gunman Kills 5 in California's Bakersfield in America
Related News