అల్‌కాక్ మూసివేతకు గుజరాత్ నిర్ణయం

Updated By ManamFri, 08/17/2018 - 06:26
ship

shipఅహ్మదాబాద్: కొన్నాళ్ళుగా నష్టాలను మూటగడుతూ వస్తున్న ప్రభుత్వ నిర్వహణలోని నౌకా నిర్మాణ కంపెనీ అల్‌కాక్ యాష్‌డౌన్  (గుజరాత్)లిమిటెడ్‌ను మూసివేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. భావనగర్ కేంద్రంగా ఉన్న ఈ కంపెనీకి కొద్ది రోజుల క్రితం ఈ మేరకు కమ్యూనికేషన్ పంపినట్లు ఒక అధికారి తెలిపారు. కంపెనీని మూసివేయడానికి సంబందించిన పద్ధతులను ఖరారు చేసేందుకు మేనేజ్‌మెంట్ ఆగస్టు 24న కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నిజానికి, ‘‘చాలా ఏళ్ళుగా అ ది పని చేయకుండా మూతపడి ఉంది. వాణిజ్య పరమైన కార్యకలాపాలేవీ సాగడం లేదు’’ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి బి.ఎస్. మెహతా చెప్పారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెహతా సంతకంతో కూడిన ఆ కమ్యూనికేషన్ తెలియజేసింది. ‘‘భారత నౌకా దళానికి, అండమాన్ అండ్ నికోబార్ ఐలండ్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన వాటితో సహా అసంపూర్ణ ప్రాజెక్టులు, ఉద్యోగులను రిలీవ్ చే యడానికి సంబంధించిన అంశాలు, ఆస్తులకు సంబంధించిన నిర్ణయాలు, కోర్టు కేసులను గుజరాత్ మారిటైమ్ బోర్డ్ చూసుకుంటుంది’’ అని కమ్యూనికేషన్ వెల్లడించింది. భావనగర్ మునిసిపల్ కమిషనర్ ఎం.ఎ. గాంధీ ఈ కంపెనీకి ఉద్యోగతః మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ‘‘కంపెనీలో ప్రస్తుతం 60 మంది ఉద్యోగులున్నారు. సంస్థ దాదాపుగా మూతపడిన స్థితిలో ఉంది. కంపెనీల చట్టం ప్రకారం, ఉద్యోగులకు సంబంధించి నిర్ణయం తీసుకుంటాం’’ అని గాంధీ చెప్పారు. మొదట్లో బ్రిటిష్ యాజమాన్యంలో ఉన్న అల్‌కాక్ యాష్‌డౌన్ కంపెనీని కేంద్ర ప్రభుత్వం 1975 లో స్వాధీనం చేసుకుంది. తదనంతరం గుజరాత్ ప్రభుత్వం 1994లో కైవసం చేసుకుంది. కంపెనీ ప్రధానంగా నౌకా నిర్మాణం, నౌకా మార్పిడి, నౌకను పూ ర్తిగా ప్రక్షాళన చేసే ప్రాజెక్టులను నిర్వహించేది. దానికి భావనగర్ తీరంలో ఒకటి, అమ్రేలీ జిల్లాలోని చంచ్‌లో ఒకటి నౌకా నిర్మాణ కేంద్రాలున్నాయి. 

Tags
English Title
Gujarat decision to shut down Alak
Related News