ఘనంగా వైట్‌కేన్ డే

Updated By ManamMon, 10/15/2018 - 23:42
Bathukamma
  • బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న 13 దేశాల దివ్యాంగులు  

imageహైదరాబాద్: వరల్డ్ వైట్ కెన్ డే సందర్భంగా మాదాపూర్‌లోని హైటెక్స్ న్యాక్‌లో  సోమవారం వికలాంగుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ ఫర్ ది డిసేబ్లేడ్(ఫెడ్) డిసెబుల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డక్కీ)ఆధ్వర్యంలో సాంస్క తిక కార్యక్రమాలతో పాటు, బతుకమ్మ సంబురాలతో సహా ఉచిత వైద్య శిబిరం, బస్ పాస్‌ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ శైలజ, సాంసృ్కతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, మామిడి హరికృష్ణ,  13 దేశాలకు చెందిన దివ్యాంగులు, వివిధ ప్రతినిధులు హాజరయ్యారు.    ఈ వేడుకలో వికలాంగులు పాల్గొనడం సంతోషంగా ఉందని వికలాంగులు హర్షం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో వికలాంగులు శాలిని, లక్ష్మిప్రియ, భవాని, రాణి, రాజేశ్వరి, కోడికంటి రాము, నరేష్, రాజు, అంజనేయులు, వెంకట్, నారాయణ, వెంకటేశ్‌లు పాల్గొన్నారు.

English Title
Greatly Whitecane Day
Related News