రాజమండ్రిలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం

Updated By ManamTue, 06/12/2018 - 18:10
Grand welcome, Ys jagan mohan reddy, Rajamandry road co railway bridge
  • రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జిపై భారీ జనసందోహం

  • పెద్దఎత్తున తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు  

Grand welcome, Ys jagan mohan reddy, Rajamandry road co railway bridgeరాజమహేంద్రవరం: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. జగన్‌ కొవ్వూరు నుంచి బయలుదేరి రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జికి చేరుకున్నారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం జిల్లాలోకి ప్రవేశించగానే అక్కడి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు తరలిరావడంతో రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రమైంది.

జగన్ పాదయాత్ర సందర్భంగా రోడ్‌ కం రైల్వే బ్రిడ్జిని వైఎస్సార్‌సీపీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో అందంగా తీర్చిదిద్దారు. బ్రిడ్జి కింద గోదావరిలో ఒక వైపున పార్టీ జెండాలతో అలంకరించిన 600 పడవలు జగన్‌కు స్వాగతం పలికాయి. బ్రిడ్జికి మరోవైపున రెయిలింగ్‌కు 7 అడుగుల ఎత్తు, 3.5 కిలోమీటర్ల మేర భారీ పార్టీ జెండాను కట్టి జననేత కు సాధారంగా స్వాగతం పలికారు. 
Grand welcome, Ys jagan mohan reddy, Rajamandry road co railway bridge

Grand welcome, Ys jagan mohan reddy, Rajamandry road co railway bridge
English Title
Grand welcomed to Ys jagan mohan reddy at Rajamandry road co railway bridge
Related News