సరైనోడు దొరికాడట

Updated By ManamFri, 11/09/2018 - 05:14
alia

బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ హీరో రణభీర్ కపూర్‌తో పీకల లోతుల్లో ప్రేమలో మునిగి ఉంది. ఇది వరకు రణభీర్ దీపికా, కత్రినాలతో ప్రేమాయణం నడిపినా పెళ్లి వరకు కొనసాగించలేకపోయారు. తాజాగా రణభీర్, అలియా మధ్య ప్రేమాయణం నడుస్తుంది. ఇటీవల ఓ షోలో అలియా మాట్లాడుతూ ‘‘నాకు సరైనోడు దొరికాడు.. నా పట్ల ప్రేమ, అభిమానం ఉన్నవాడే కాదు.. అందమైనవాడు కూడా. దర్శకులు చెప్పినట్లు నేను కెమెరా ముందు నటిస్తాను కానీ నిజ జీవితంలో నటించను. నటించాల్సిన అవసరం రాలేదు’ అంటూ చెపుకొచ్చింది. వీరిద్దరూ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్‌లో వినపడుతున్నాయి. మరి రణభీర్, అలియా ప్రేమ పెళ్లి వరకు కొనసాగుతుందా? అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.
 

image

 

English Title
got the right person
Related News