‘గోపిచంద్’ బయోపిక్‌కు ముహూర్తం కుదిరిందా..?

Updated By ManamWed, 06/13/2018 - 12:34
pullela

pullela ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించాలని టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుధీర్ బాబు హీరోగా ప్రవీణ్ సత్తారు ఈ బయోపిక్‌ను తెరకెక్కించాలనుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే కొన్ని కారణాల వలన ఇంతవరకు ఈ బయోపిక్ సెట్స్ మీదకు వెళ్లలేకపోయింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

దీనిని ఎలాగైనా తెరకెక్కించాలని హీరో సుధీర్ బాబు భావిస్తుండగా, అందుకు తగ్గట్లుగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారట. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని సుధీర్ బాబు అనుకుంటున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా సుధీర్ బాబు, అదితీ రావు హైదారీ జంటగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన సమ్మోహనం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

English Title
Gopichand biopic details..?
Related News