ముచ్చటగా మూడోసారి..?

Updated By ManamThu, 05/17/2018 - 16:23
gopichand, anushka

Anushka, Gopichand ‘లౌక్యం’ తరువాత ఇంతవరకు చెప్పుకోదగ్గ హిట్ లేని గోపిచంద్, ప్రస్తుతం చక్రవర్తి దర్శకత్వంలో ‘పంతం’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత జయేంద్ర దర్శకత్వంలో గోపిచంద్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో గోపిచంద్ సరసన అనుష్క నటించనున్నట్లు సమాచారం.

‘భాగమతి’ తరువాత ఇంతవరకు ఏ సినిమాను ఒప్పుకోని అనుష్క, జయేంద్ర చెప్పిన కథకు వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అయితే ఈ ఇద్దరు గతంలో ‘లక్ష్యం’, ‘శౌర్యం’ చిత్రాల్లో నటించారు. ఆ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

 

English Title
Gopichand, Anushka paired up third time..?
Related News