అమెరికాలో ‘గూఢచారి’ హవా

Updated By ManamFri, 08/10/2018 - 16:29
Goodachari

Goodachariయువ నటుడు అడవి శేష్ నటించిన గూఢచారి చిత్రంపై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్లను రాబట్టింది. ఈ విషయాన్ని అడవి శేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆనందం వ్యక్తం చేశాడు.

ఇక సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అడవి శేష్ సరసన శోభితా నటించగా.. ప్రకాశ్ రాజ్, సుప్రియ, వెన్నల కిశోర్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు.

 

English Title
Goodachari collects half million dollars in America
Related News