తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Updated By ManamThu, 05/17/2018 - 20:55
Good news for Telangana govt employees

Good news for Telangana govt employees హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకు 1.5 శాతం కరువు భత్యం(డీఏ)ను పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పెంచిన డీఏ (కరువు భత్యం) జులై 1, 2017 నుంచి వర్తించనుంది. డీఏ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై రూ. 350 కోట్ల భారం పడనుంది. పింఛన్‌ దారులకు కూడా ఈ డీఏ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సీఎం కేసీఆర్‌ బుధవారం కీలక ప్రకటన సంగతి తెలిసిందే.

పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలకు సంబంధించి ఒక కరువు భత్యం (డీఏ)ను వెంటనే చెల్లిస్తామన్నారు. డీఏకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశానని, మరో డీఏను రెండు నెలల్లో చెల్లిస్తామని కేసీఆర్‌ తెలిపారు. ఈ క్రమంలోనే డీఏను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

English Title
Good news for Telangana govt employees
Related News