నిరుద్యోగులకు శుభవార్త..

Recruitment, 23 posts APPSC, AP Road Transport jobs

అమరావతి: నిరుద్యోగులకు శుభవార్త. రవాణా శాఖలో అసిస్టెంట్‌ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఖాళీగా ఉన్న 23 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 12 నుంచి జనవరి 2వరకు అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఏడాది జులై 1 నాటికి 21 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులుగా ఏపీపీఎస్సీ పేర్కొంది. మెకానికల్ ఇంజనీరింగ్, ఆటో మొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఏప్రిల్ 17న ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు కూడా ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. 

సంబంధిత వార్తలు