ఈక్విటీ విస్తృతితో మంచి రోజులు

Updated By ManamMon, 06/11/2018 - 22:23
 Air India
  • ఎయిర్ ఇండియాను స్వయం ప్రతిపత్తి కలిగిన బోర్డ్ నిర్వహించాలంటున్న నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ రాజీవ్ కుమార్

 Air Indiaన్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రానికి ఉన్న ఒక మార్గం వివిధ వాటాదారులను కూడగట్టుకోవడవేునని నీతి ఆయోగ్ వైస్- చైర్మన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘‘ఎయిర్ ఇండియా ఈక్విటీని ఎంత వీలుంటే అంత భిన్నత్వంతో కూడిన వారికి పంపిణీ చేయడమే. ఏ ఒక్కరినో కాకుండా వివిధ వాటాదార్లతో కూడిన యంత్రాంగాన్ని సమకూర్చుకోవడం ఉన్న మార్గాలలో ఒకటి. చాలా విస్తృతంగా ఉండేట్లుగా దాన్ని రూపొందించాలి. అనేక రకాల వారికి పంపిణీ జరగాలి. అప్పుడే అది సిసలైన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అవుతుంది. ఎటొచ్చీ దానికి పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలి. అది ‘పబ్లిక్’ స్వరూప స్వభావాలు కలిగినది కానవసరం లేదు. బహుళ జాతి కంపెనీల్లో ఉన్నట్లుగా ప్రైవేటు కార్పొరేట్ బోర్డ్ ఉంటుంది’’ అని రాజీవ్ కుమార్ అన్నారు. అయితే, డైరెక్టర్ల బోర్డుని, మేనేజ్‌మెంట్‌ని  ఒక ప్రైవేటు రంగ సంస్థ మాదిరిగా పనిచేసేందుకు వీలు కల్పించాలని ఆయన వివరించారు. ఆ రకమైన వ్యవస్థ విమానయాన సంస్థ అదృష్ట రేఖలో మార్పు తెస్తుందని ఆశించవచ్చని అన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో నీతి ఆయోగ్ ముఖ్య పాత్ర వహిస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వ రంగ సంస్థల జాబితాను ఇదే సూచిస్తోంది. మే 31 గడువు లోగా ఎయిర్ ఇండియాకు ఎవరూ బిడ్ చేయని వాస్తవాన్ని ఆశాభంగం కలిగించిన అంశంగా పరిగణించడానికి లేదని ఆయన చెప్పారు. స్పందన కొరవడడానికి కారణాలను కేంద్రం పరిశీలిస్తోందని, దిద్దుబాటు చర్యలు తీసుకునే పనిలో ఉందని ఆయన చెప్పారు. రాజీవ్ కుమార్ చేసిన సూచనలు, రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) రాజకీయ, సాంస్కృతిక అనుబంధ సంస్థ స్వదేశీ జా గరణ్ మంచ్ (ఎస్.జె.ఎం) చెబుతూ వస్తున్నదానికి అనుగుణంగా ఉన్నాయి.

ఎస్.జె.ఎం సూచన
ఎస్.జె.ఎం జాతీయ కో-కన్వీనర్ అశ్వని మహాజన్ ఇటీవల నీతి ఆయోగ్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులను కలుసుకున్నారు. ‘‘ఎయిర్ ఇండియాకు కావాల్సింది సరైన మేనేజ్‌మెంట్. ఎయిర్ ఇండియాను గాడిలో పెట్టే మార్గాలను సూచిస్తున్న నివేదికను మేం తయారు చేస్తున్నాం. అవి మేనేజ్‌మెంట్ రుగ్మతలను సరిదిద్దేవిగా, విమానయాన సంస్థకు చెందిన ఇంజనీరింగ్ విభాగం వంటి ఇతర శాఖల సరైన స్థితిలో పెట్టేదిగా ఉంటుంది. దాన్ని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసి, షేర్లను విక్రయించడం ఒక పరిష్కారం. ఒకసారి లిస్ట్ అయితే, నగదు ప్రవాహం, వస్తున్న రాబడులు, పనితీరు సూచీలలో కనిపించిన తాజా మెరుగుదలను ఆధారం చేసుకుని భవిష్యత్ అంచనాలకు రావడం వంటివి చేసి, మర్చంట్ బ్యాంకర్లు ఒక ఆఫర్ ధరతో  ముందుకొచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా ఈరకమైన ఆలోచనను అమలుపరచేందుకు సుముఖంగా ఉంది’’ అని అశ్వని మహాజన్ చెప్పారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా అదే రకమైన అభిప్రాయంతో ఉన్నారు. పటిష్టమైన, స్వయంప్రతిపత్తితో కూడిన అధినేత ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు పునర్వైభవం తీసుకురాగలరని ఆయ న ఒక ట్వీట్ల శ్రేణిలో పేర్కొన్నారు. 

Tags
English Title
Good days with equity wider
Related News