సౌరభ్‌కు స్వర్ణం

Updated By ManamFri, 11/09/2018 - 02:48
saurabh
  • ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్

  • saurabhకువైట్ సిటీ: భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి తన ఖాతాలో మరో స్వర్ణ పతకాన్ని వేసుకున్నాడు. గురవారం ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన 10 మీటర్ల ఎయిర్‌పిస్టోల్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతాకాన్ని గెలుపొందాడు. టీమ్ ఈవెంట్‌లో అర్జున్ సింగ్, అన్‌మోల్ జైన్‌లతో కలిసి 1731 పాయింట్లతో బంగారు పతకం సాధించిన సౌరభ్, తర్వాత జరిగిన వ్యక్తిగత విభాగంలో 239.8 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఇటీవల ఆగస్టులో జరిగిన ఆసియా గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన సౌరభ్, సెప్టెంబర్‌లో జరిగిన వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో, అక్టోబర్‌లో జరిగిన యూత్ ఒలింపిక్స్ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. సౌరభ్ తర్వాత అర్జున్ 237.7 పాయింట్లతో రజత పతకం సాధించగా... చైనీస్ తైపీకి చెందిన హుయంగ్ వీ 218.0 పాయింట్లతో కాంస్య పతకం సాధించాడు. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం 10 పాయింట్ల సాధించగా... అందులో మూడు స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్యాలు ఉన్నాయి.

English Title
Gold to Saurabh
Related News