ఫిలిప్పీన్స్‌కు జీఎంఆర్ వినతి

Updated By ManamWed, 07/11/2018 - 22:13
gmr

gmrహైదరాబాద్: జీఎంఆర్ గ్రూప్ ఫిలిప్సీన్స్‌లో క్లార్క్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ, నిర్వహణకు వేసిన బిడ్‌పై అనర్హత వేటు పడింది. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ రేటింగ్ సంస్థ స్కై ట్రాక్స్ నుంచి అవసరమైన ర్యాంకింగ్ జీఎంఆర్‌కి లేకపోవటమే అందుకు కారణమని తెలుస్తోంది. ఫిలిప్పీన్స్‌లో భాగస్వామ్య కంపెనీ అయిన మెగావైడ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌తో కలిసి క్లార్క్ విమానాశ్రయం నిర్మించేందుకు  జీఎంఆర్ మొదట్లో ఇ.పి.సి కాంట్రాక్టును పొందింది. అయితే, తాజా పరిణామం అనంతరం కూడా మెగావైడ్ కొత్త భాగస్వామిని అన్వేషించడం లేదు. అర్హతకు సంబంధించిన నిబంధనలు సడలించవలసిందిగా జీఎంఆర్ సంస్థ ఫిలిప్పీన్స్ అధికారులకు విజ్ఞప్తి చేసింది.  హైదరాబాద్, ఢిల్లీలలో తాము నిర్వహిస్తున్న విమానాశ్రయాలకు  ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్  ఇంటర్నేషనల్  ఉత్తమ విమానాశ్రయ రేటింగ్ ఇచ్చిన సంగతిని జీఎంఆర్ ఈ సందర్భంగా ఫిలిప్పీన్స్ అధికారులకు గుర్తు చేసింది.

Tags
English Title
GMR listening to the Philippines
Related News