నన్ను పెళ్లిచేసుకుంటావా: స్టేజ్‌పైన ప్రేయసికి దర్శకుడు ప్రపోజ్

Updated By ManamTue, 09/18/2018 - 14:31
glen weiss

glen weissలాస్‌ఏంజిల్స్: 70వ ఎమ్మీ అవార్డు కార్యక్రమం అమెరికాలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువరు నటీనటులు సందడి చేశారు. కాగా ఈ అవార్డు కార్యక్రమంలో అవార్డును తీసుకున్న ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు గ్లెన్ వీస్.. స్టేజ్‌పైనే తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. 

కాగా 2018 ఆస్కార్‌ వేడుకలకు డైరక్టర్‌గా వ్యవహరించినందుకు గానూ గ్లెన్ వెరైటీ స్పెషల్ ఎమ్మీ అవార్డును అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు నాకు కొంచెం బాధగా, కొంచెం ఆనందంగా ఉంది. రెండు వారాల క్రితమే నా తల్లి మరణించింది. ఆ గాయం ఎప్పటికీ మానదు. మా అమ్మ తరువాత నన్ను అంతబాగా చూసుకునేది నా ప్రేయసి జాన్. జాన్.. నువ్వే నా జీవితానికి వెలుగు. ఆ వెలుగును నా నుంచి ఎప్పటికీ దూరం చేయకు. నేను నిన్ను గర్ల్‌ఫ్రెండ్ అని పిలవను. ఎందుకంటే నువ్వు నాకు గర్ల్‌ఫ్రెండ్‌గా కాదు. నా భార్యగా ఉండాలి అని అన్నారు. ఈ వ్యాఖ్యలకు జాన్‌తో పాటు అక్కడున్న అందరూ లేచి చప్పట్లు కొట్టారు. ఆ తరువాత జాన్ స్టేజ్‌మీదకు వెళ్లగా.. ఆమె వేలికి ఉంగరం తొడిగి నన్ను పెళ్లిచేసుకుంటావా అంటూ గ్లెన్ వీస్ ప్రపోజ్ చేశాడు. దీనికి వెంటనే ఆమె ఒప్పుకున్నారు. 

English Title
Glenn Weiss’s Emmys proposal to his girlfriend
Related News