అమ్మాయిలే టాప్

Updated By ManamSun, 05/27/2018 - 01:52
image
  • తొలి రెండు స్థానాల్లో వారే.. గతేడాది కన్నా ఒక శాతం మెరుగు

  • సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

imageన్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి ఫలితాల్లో అమ్మా యిల హవా కొనసాగింది. మొత్తంగా 83.01% అమ్మాయిలు ఉత్తీర్ణత సాధిం చగా.. 78.99 శాతంతో అబ్బాయిలు వెనకబడ్డారు. గతేడాదితో పోలిస్తే అమ్మా యిల ఉత్తీర్ణత ఒక శాతం పెరిగిందని సీబీఎస్‌ఈ పేర్కొంది. పన్నెండో తరగతి ఫలితాలను సీబీఎస్‌ఈ శనివారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొదటి రెండు స్థానాల్లోనూ అమ్మాయిలే నిలవడం విశేషం! నోయిడాకు చెందిన మేఘనా శ్రీవాత్సవ టాపర్‌గా నిలిచారు. మొత్తం 500ల మార్కులకు గానూ 499 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలవగా.. 498 మార్కులతో ఘజియాబాద్‌కు చెందిన అనౌష్క చంద్ర రెండో స్థానంలో నిలిచారు. 497 మార్కులతో ఏడుగురు విద్యార్థులు మూడో స్థానంలో నిలిచారని సీబీఎస్‌ఈ అధికారులు పేర్కొన్నారు. ఈ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలతో 97.32 ఉత్తీర్ణత శాతం త్రివేండ్రం(కేరళ) మొదటి స్థానంలో నిలవగా.. 93.87 శాతంతో చెన్నై ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఢిల్లీ కాస్త వెనకబడి 89 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. కాగా, సీబీఎస్‌ఈ నిర్వహించిన పన్నెండో తరగతి పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షలకు పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇందులో మొత్తం 12,737 మంది విద్యార్థులు 95% మార్కు లు, 72,599 మంది 90% మార్కులు సాధిం చారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక దివ్యాంగుల కేటగిరీలో 98.4% మార్కు లతో పాళక్కడ్‌కు చెందిన విజయ్ గణేష్ మొదటి స్థానం దక్కించుకున్నాడు. డెహ్రడూన్‌కు చెందిన పూజ కుమారి 97.8 శాతంతో ద్వితీయ స్థానాన్ని, ఆర్‌కే పురానికి చెందిన లావణ్య ఝా తృతీయ స్థానంలో నిలిచారు. కాగా, లీకేజీ వార్తల నేపథ్యంలో పన్నెండో తరగతి ఆర్థిక శాస్త్ర పరీక్షను బోర్డు మళ్లీ నిర్వహించిన విషయం తెలిసిందే! పరీక్షలు పూర్తయ్యాక నెల తర్వాత ఆర్థిక శాస్త్రం పరీక్షను తిరిగి నిర్వహించడం విద్యార్థులతో పాటు తల్లిదండ్రులనూ అయోమయానికి గురిచేసింది.

చాలా సంతోషంగా ఉంది: అనౌష్క
‘సీబీఎస్‌ఈ ఫలితాలలో రెండో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. అమ్మా నాన్నలతో పాటు మా స్కూల్ ప్రిన్సిపాల్ కూడాimage నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ర్యాంకు సాధించానంటే వారి కృషే ప్రధాన కారణం’ అని అనౌష్క చంద్ర తెలిపారు. ఘజియాబాద్‌కు చెందిన అనౌష్క ఇంగ్లీష్‌లో మినహా మిగతా సబ్జెక్టులలో వందకు వంద సాధించారు. ఇంగ్లీష్‌లో 98 మార్కులతో మొత్తంగా 498 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 

హార్డ్‌వర్క్‌తోనే విజయం: మేఘన
‘నా విజయం వెనక ఎలాంటి సీక్రెట్ ఫార్ములా లేదు. ఏడాది పొడవునా పట్టుదలగా చదివాను. మంచి మార్కులు వస్తాయని తెలుసు.. అయితే, టాపర్‌గా నిలుస్తానని అనుకోలేదు. ఈ ఫలితాలు నాకెంతో సంతృప్తినిచ్చాయి. ఒక్క ఇంగ్లీష్‌లో మినహా మిగతా సబ్జెక్ట్‌లలో వందకు వంద సాధించాను. ఇంగ్లీష్‌లో ఒక మార్కు తగ్గడంతో మొత్తం 500ల మార్కులకు గానూ 499 మార్కులు సాధించాను’ అని ఈ ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన మేఘనా శ్రీవాస్తవ తెలిపారు. నోయిడాకు చెందిన మేఘన స్థానికంగా ఉన్న స్టెప్ బై స్టెప్ స్కూల్‌లో చదివారు. పరీక్షలలో విజయం సాధించాలంటే ఓ ప్రణాళిక ప్రకారంగా చదవాలంటూ మేఘన సలహా ఇచ్చారు. కాగా, తన మేనకోడలు మేఘన మొదటి నుంచి తెలివైన విద్యార్థేనని సీబీఐ మాజీ డైరెక్టర్ అనిల్ సిన్హా పేర్కొన్నారు. 

English Title
The girls are the top
Related News