ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష

Updated By ManamFri, 09/14/2018 - 12:19
GHMC Commissioner Dana kishore reviews Revised Voter List
GHMC commissioner dana kishore

హైదరాబాద్ : నగరంలోని ఓటర్ల జాబితా సవరణపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోష్ శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ... ‘ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల పరిశీలన చేయాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా చేర్పించాలన్నారు.

అలాగే ఇల్లు మారిన ఓటర్లకు ఫారం-7 ద్వారా మారిన ఇంటి వద్దే ఓటును బదిలీ అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఏడు పోలింగ్ కేంద్రాలకు ఒక పర్యవేక్షక అధికారి నియామకం చేపట్టాలన్నారు. ఇక మరణించినవారి ఓట్లను తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో బల్దియా వైద్య అధికారులు పాల్గొన్నారు.
 

English Title
GHMC Commissioner Dana kishore reviews Revised Voter List
Related News