ప్రముఖ చానెల్ చేతికి ‘మహర్షి’ ప్రసార హక్కులు

Updated By ManamWed, 10/17/2018 - 14:35
Mahesh Babu

Maharshiమహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహర్షి’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. తాజాగా ప్రసార హక్కులు అమ్ముడుపోయాయి. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ చానెల్ జెమినీ మహర్షి బ్రాడ్‌కాస్ట్ హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ రేటు కూడా చెల్లించినట్లు తెలుస్తోంది.

మహేశ్ క్రేజ్, సినిమాపై మంచి అంచనాలు ఉండటంతోనే జెమినీ ఈ సినిమా బ్రాడ్‌కాస్ట్ హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటించగా.. అల్లరి నరేశ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

English Title
Gemini TV brought Maharshi broadcasting rights
Related News