నాన్న పాత్రను తప్పుగా చూపారు: జెమినీ గణేషన్ కుమార్తె

Updated By ManamThu, 05/17/2018 - 09:38
mahanati

kamala  సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో తన తండ్రి పాత్రను తప్పుగా చూపించారని జెమినీ గణేషన్ మొదటి భార్య కుమార్తె, ప్రముఖ వైద్యురాలు కమలా సెల్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సావిత్రి కంటే ముందే జెమినీ గణేశన్ తన తల్లిని పెళ్లాడి ఇద్దరు పిల్లను కూడా కన్నారని, తొలి ప్రేమ సావిత్రి మీద కాదని, తన తల్లిమీదేనని తెలిపారు. 

ఇక సినిమాలో చూపించినట్లు సావిత్రికి జెమినీ గణేశన్ మద్యం అలవాటు చేయలేదని, ఆమెనే తన తండ్రికి మద్యాన్ని అలవాటు చేసిందని కమలా సెల్వరాజ్. కెరీర్ మొత్తం బిజీగా ఉన్న తన తండ్రిని అవకాశాలు లేక ఖాళీగా కూర్చున్నట్లు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ‘ప్రాప్తం’ సినిమా నుంచి వెనక్కు తగ్గాలని చెప్పడానికి నాన్నతో పాటు తాను కూడా సావిత్రి ఇంటికి వెళ్లామని.. ఆ సమయంలో ఆమె తమపైకి కుక్కులను ఉసిగొల్పిందని, వాటి నుంచి తప్పించుకునేందుకు గోడ దూకి పారిపోయామని కమలా సెల్వరాజ్ గుర్తు చేసుకున్నారు. అయినా ప్రేక్షకులు జెమినీ గణేశన్‌ను అంగీకరించకుంటే ‘కాదల్ మన్నన్’ అనే బిరుదును ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. అయితే మరోవైపు ఈ చిత్రంపై సావిత్రి, జెమినీ గణేశన్ కుమార్తె, కుమారుడు చాముండేశ్వరి, సతీశ్‌లు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తన తల్లికి ఈ చిత్రం ఘన నివాళి అని వారు తెలిపారు. ఇదిలా ఉంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

English Title
Gemini Ganesan daughter fire on Mahanati
Related News