‘స్వలింగ’ విచారణ నేటికి వాయిదా

Updated By ManamTue, 07/10/2018 - 23:36
supremcourt
  • సమగ్రంగా పరిశీలిస్తామన్న ధర్మాసనం.. సమాజం.. విలువలు మారుతున్నాయి

  • నైతికతకు అర్థం.. నిర్వచనం ఇప్పుడు వేరు.. కోర్టులో మాజీ ఏజీ ముకుల్ రోహత్గీ వాదన

supremcourtన్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమా.. కాదా అన్న విషయమై విచారణను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది. 2013లో సుప్రీంకోర్టు ఈ విషయంలో ఇచ్చిన తీర్పును, అలాగే ఎల్ జీబీటీక్యూ వర్గానికి ఉన్న ప్రాథమిక హక్కులు, సెక్షన్ 377కు గల రాజ్యాంగ బద్ధత.. ఈ అంశాలన్నింటినీ తాము పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్, జస్టిస్ వైవీ చంద్రచూడ్,  జస్టిస్ ఎఎమ్ కన్వీల్కర్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన విస్తృత ధర్మాసనం  తెలిపింది. సమాజం మారుతోందని, దాంతోపాటే విలువలు కూడా మారుతున్నాయని పిటిషనర్ల తరఫున వాదించిన న్యాయవాదులు కేశవ్ సూరి, మాజీ ఏజీ ముకుల్ రోహత్గి తెలిపారు. 160 ఏళ్ల క్రితం నైతిక విలువలు అనుకున్నవి ఇప్పుడు కావని, అలాగే అప్పుడు అనైతికం అనుకున్న చాలా అంశాలు ఇప్పుడు నైతికమని చెప్పారు. ఈ తరహా ప్రజల పట్ల సమాజం ఎలా చూస్తోందన్న విషయం మీద సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్రభావంచ చూపుతుందని అన్నారు.  ఐపీసీ సెక్షన్ 377... ఈ సెక్షన్ కింద ప్రకృతి విరుద్ధంగా జరిగే లైంగిక సంపర్కం నేరం. మగవాళ్ళు మగవాళ్లతో.. లేదా మహిళలు మహిళలతో శృంగారంలో పాల్గొనడం అనైతిక చర్యగా పరిగణిస్తారు. ఐపీసీ 377 సెక్షన్ కింద ‘అసహజమైన నేరాల’ (ఎవరైనా పురుషుడు, లేదా స్త్రీ, లేదా జంతువుతో అసహజ సంపర్కానికి) పాల్పడేందుకు ప్రయత్నించినా, పాల్పడినా వారికి యావజ్జీవిత జైలు శిక్ష, లేదా పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం వుంది. దీనితో పాటు భారీ జరిమానా కూడా విధించొచ్చు. స్వలింగ సంపర్కం నేరం కిందకే వస్తుందంటూ గతంలో(2013) అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వగా.. ఇప్పుడు ఆ తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు తాజాగా మొగ్గు చూపింది. 

English Title
The 'gay' trial is postponed today
Related News