ఆర్మీలో ‘గే’లకు నో ఎంట్రీ: రావత్

On gay sex in Army, chief Bipin Rawat says such actions are forbidden

న్యూఢిల్లీ : ఆర్మీలోకి స్వలింగ సంపర్కులకు నో ఎంట్రీ అని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు.  సైన్యం ఏటా నిర్వహించే పత్రికా సమావేశంలో ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ.. భారత సైనిక దళం సాంప్రదాయకమైనదని అన్నారు. కాగా గత ఏడాది సుప్రీంకోర్టు గే సెక్స్‌‌కు అనుకూలంగా తీర్పునిచ్చిన విషయాన్ని ప్రస్తావించగా రావత్ పైవిధంగా సమాధానం ఇచ్చారు.

 సైన్యంలోకి వ్యభిచారులను, స్వలింగ సంపర్కులను అనుమతించడం సాధ్యం కాదని అన్నారు. సైన్యం చట్టాలకు అతీతం కాదని, అయితే రాజ్యాంగం సైన్యానికి కొంత స్వాతంత్ర్యాన్ని ఇచ్చిందని రావత్ వ్యాఖ్యానించారు. మనం ఆధునీకరణ చెందలేదని, అలాగే పాశ్చాత్యంగా కూడా మరలేదని, ఎల్జీబీటీల సమస్యలను ఇక్కడ మనం ఆమోదించలేమని ఆయన పేర్కొన్నారు. కాగా స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పునిచ్చింది.

సంబంధిత వార్తలు