26ఏళ్ల తరువాత తెరుచుకున్నాయి..

Updated By ManamFri, 08/10/2018 - 15:45
 Idukki Dam, digital, Gates, Periyar

 Idukki Dam, digital, Gates, Periyarతిరువనంతపురం: ఎడతెగని భారీ వర్షాలతో కేరళ అతులాకుతలమైంది. భారీగా వరదనీరు ముంచెత్తడంతో రాష్ట్రంలోని పెరియర్ వద్ద ఇడుక్కి డ్యామ్‌ నీటిమట్టం పెరిగిపోయి అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు వారం క్రితం మూడు గేట్లు ఎత్తిన సంగతి తెలిసిందే. ఇడుక్కి డ్యామ్ గేట్లను రెండెన్నర దశబ్దాలు (26ఏళ్లకు పైగా) తర్వాత ఎత్తడం కేరళ చరిత్రలో ఇదే తొలిసారి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదనీరు ఉధృతంగా ప్రవహించి రోజురోజుకీ ప్రమాదకరంగా మారుతోంది. పెరియర్ మీదుగా డ్యాంలోని వరదనీటిని దిగువ ప్రాంతాలకు వదిలేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకూ మొత్తం 5 గేట్లను ఎత్తివేశారు. కేరళలో భారీ వర్షాల కారణంగా వరదనీటిలో చిక్కుకొని ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 26 మంది మృతిచెందారు. ఇడుక్కి డ్యాం సామర్ధ్యం 2403 అడుగులు మాత్రమే కాగా, డ్యాంలోకి వరదనీరు భారీగా వచ్చి చేరింది. ప్రస్తుతం ఇడుక్కి డ్యాం నీటిమట్టం 2401గా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.

వరద నీటి ఉధృతి పెరగడంతో స్పందించిన కేరళ ప్రభుత్వం ఇడుక్కి డ్యాం మరో రెండు గేట్లను ఎత్తివేసింది. మొత్తం మూడు గేట్లను ఎత్తిన అధికారులు.. మొత్తం 1,25,000 లీటర్ల నీటిని సెకన్‌ చొప్పున దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. డ్యామ్‌ నుంచి మరికొంచెం నీటిని విడుదల చేసినప్పటికీ పెరియర్ బ్యాంక్ పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. ఇడుక్కి డ్యాంను 26ఏళ్ల తరువాత తొలి గేటును ఆగస్టు 9న విడుదల చేశారు. డ్యామ్ ‌నుంచి వరదనీటిని గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు విడుదల చేయడాన్ని చూడవచ్చు. ఆసియాలోని అతిపెద్ద రిజర్వాయర్‌లలో ఇడుక్కి డ్యామ్‌‌ ఒకటి. ఈ డ్యామ్‌ గేట్లలో ఒకటి 1992లో తెరవగా, అంతకుముందు 1981లో గేట్లను తెరవగా, అంతకుముందు 1981లో డ్యామ్ నుంచి నీరు పోశారు. ఇడుక్కి డ్యామ్‌కు మొత్తం ఐదు షెట్లర్లతో పాటు గేట్లు కూడా ఉన్నాయి. 

English Title
Gates Open for Idukki dam
Related News