ఆర్థిక సంఘం పనితీరు మారాలి

kcr
  • కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో నిరాశ

  • ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు చేయాలె

  • అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించాలె

  • ఆర్థిక శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్: భారత ఆర్థిక వ్యవస్థను గుణాత్మక దిశగా నడిపించేందుకు ఆర్ధిక సంఘం నడుం బిగించాల్సి వుందని మూసపద్దతిలో కాకుండా తన పాత్రను వినూత్నంగా తీర్చిదిద్దుకో వాల్సిన అవసరం వున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభిప్రాయ పడ్డారు. కొద్దిరోజుల్లో 15వ ఫైనాన్స్ కమిషన్ బృందం రాష్ర్ట పర్యటనకు రానున్న నేప థ్యంలో ఆర్థిక శాఖ, ఇతర సీనియర్ అధికారులతో శనివారం కీలక సమీక్ష నిర్వహిం చారు. చీఫ్ అడ్వయిజర్ రాజీవ్ శర్మ, చీఫ్ సెక్రటరీ ఎస్ కే జోషీ, ఆర్థిక శాఖ సలహాదారు జిఆర్ రెడ్డి, సిఎంవో అధికారులు నర్సింగ్ రావు, స్మితా సబర్వాల్,  సందీప్ సుల్తానియా, మానిక్ రాజ్, స్పెషల్ సిఎస్ రాజేశ్వర్ తివారి, ఫెనాన్స్ సెక్రటరీ రామక ష్ణారావు, పంచాయతీ రాజ్ సెక్రటరీ వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, ఐటి సెక్రటరీ జిటివీ రావు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. స్వాతంత్య్రకాలం నుంచి రాష్ర్ట జాతీయ స్థాయిలో అనేక పార్టీల ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి కానీ ఎటువంటి గుణాత్మక మార్పును తీసుకురాలేక పోయిన నేపథ్యంలో తిరిగి లోతయిన విశ్లేషణ,ఆత్మావలోకనం చేసుకోవాల్సిన  అవసరం ఉన్నదన్నారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు తీవ్ర అసంత ప్తితో నిరసన వ్యక్తం చేస్తుండడం విచారకరమన్నారు. దీనికి కాంగ్రేస్ బిజెపి అనే రెండు రాజకీయ వ్యవస్థలే మూలకారణమని సిఎం స్పష్టం చేశారు. ‘‘ దేశానికి విశాలమైన విత్త విధానం వున్నది. వికేంద్రీకరణ చేయాల్సిన అధికారాలను అందుకు విరుద్దంగా కేంద్రీకరించారు. పురోగతి సాధిస్తున్న రాష్ట్రాల విధానాల్లో జోక్యం చేసుకోవద్దని నేను నీతి ఆయోగ్ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు స్పష్టం చేశాను.రాష్ర్ట ప్రగతిని దేశ ప్రగతిగా పరిగణించాలి. పురోగతి సాధిస్తున్న రాష్ట్రాలను నిరుత్సాహపరచొద్దు. చిన్న చిన్న నిధులను విడుదల చేయడానికి కూడా అనేక నిబంధనలను విధిస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రానికి నడుమ ఉండాల్సిన రాజ్యాంగ సంబంధం రోజురోజుకూ కనుమరుగవుతున్నది. రాష్ట్రాల అధికారాలు, హక్కుల పంపిణీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రాలను కించపరిచే విధంగా వుండడం అత్యంత విచారకరం. ఫైనాన్స్ కమీషన్ పాత్రను ప్రస్తావిస్తూ సిఎం మాట్లాడుతూ.. రాష్ట్రాలలో పర్యటించే క్రమంలో ఫెనాన్స్ కమీషన్ సభ్యులు ముందే వొక అభిప్రాయాన్ని కలిగి వుండడం సరికాదు. రాష్ట్రాన్ని పర్యటించి రాష్ర్ట ప్రభుత్వంతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా క్షేత్ర స్థాయి పర్యటనకు ముందే వొక అవగాహనతో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చేయడం సరికాదన్నారు. వొక్కో రాష్ట్రానికి వొక్కో సాంస్క్రతిక ఆర్దిక జీవిన విధానం వుంటుందనీ, ఆయా రాష్ట్రాల అవసరాల రీత్యా డివల్యూషన్ అంశం రాష్ట్రాల హక్కుగా పరిగణించి.. కేవలం విధనాల రూపకల్పనకు మాత్రమే ఫైనాన్స్ కమిషన్ పరిమితమైతే మంచిదన్నారు. చర్చించిన ఈ అంశాలన్నీ పరిశీలించి, తెలంగాణ రాష్ర్ట ప్రజల అవసరాలను ద ష్టిలో ఉంచుకుని నివేదికను రూపొందించాలని ఆర్థిక శాఖ అధికారులకు సిఎం సూచించారు.

 బడ్జెట్ పై ముందస్తు కసరత్తు
బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ఏర్పాట్లు అందుకు కావాల్సిన ముందుగా అవసరమైన చర్యల మీద ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ర్ట ప్రజల జీవికను నిర్వచించుకున్న అనంతరమే ప్రజల అవసరాలను అన్నిరంగాల్లో పరిశీలించిన మీదటనే తుది బడ్జెట్ కు రూపకల్పన చేయాలని సిఎం స్పష్టం చేశారు. కేవలం వొక్క ఏడాదికా లేకా ఐదేండ్ల పూర్తి కాలానికా అనే అవగాహనతో మనం రూపొందిస్తున్న బడ్జెట్ విధి విధానాలు ఉండాలన్నారు. తెలంగాణ నేడు ఎక్కడ వున్నది..రానున్న ఐదేండ్ల తర్వాత ఎక్కడ ఉండబోతున్నది అనే అవగాహనతో అంచనాతో బడ్జెట్ ను రూపొందించాలన్నారు.  ప్రభుత్వం కేవలం చట్టాలను అమలు పరచడమే కాకుండా రాష్ట్రాభివ ద్దిని సులభతరం చేస్తూ వొక ఉత్ప్రేరకంగా ఉద్దీపనకారిగా  తన పాత్రను నిర్వహిస్తుందన్నారు. బడ్జెట్ రూపకల్పనకు ముందు వొక సమగ్ర విధానాన్ని రూపొందించాలన్నారు. వొక్కొక్క అంశాన్ని తీసుకుని పనిని విభజించి సమస్యను ఛేదించే వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్ధికాభివద్దిని మరింత బలోపేతం చేసే దిశగా బడ్జెట్ వుండాలన్నారు. తెలంగాణ ఒక రాష్ర్టంగా తన అభివ ద్దిని పెంచుకోవడానికి ప్రగతి మార్గంలో పయనించడానికి, అవలంబించాల్సిన మార్గదర్శకా లేమిటి.? తెలంగాణ రాష్ర్టంగా మన ఆర్థిక ప్రగతికి దోహద పడుతున్న అశాలేమిటి.? అనే అంశాలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్ ను రూపొందించాలన్నారు. ‘‘సిఎంగా నన్ను ప్రజలు ఎన్నుకున్నప్పుడు నేను వారికి ఎంత గొప్పగా సేవలందించగలనో ఆలోచన చేయాలె. ఆదరాబాదరాగా కాకుండా ముందుగా వొక సమగ్ర అవగాహనకు వచ్చిన తర్వాతనే బడ్జెట్ ను రూపొందించడానికి పూనుకోవాలి. అటువంటి కీలక బడ్జెట్ ను రూపొందించడానికి పూనుకున్న వ్యక్తులు అధికారులు ఆ దిశగా తమ ద క్పధాన్ని ఏర్పరుచుకోవాలి. మనకున్న బలాలేమిటి బలహీనతలూమిటి మంచి చెడులను బేరీజు వేసుకున్న అనంతరమే పని ప్రారంభించాలి. రాబోయే ఐదేండ్ల కాలంలో రాష్ట్రానికి ఎంత డబ్బు వస్తున్నది ఎంత డబ్బు ఖర్చు కాబోతున్నదో అనే వొక సమగ్ర అంచానా వుండాలి.’’ అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ర్టంలో నడుస్తున్న సాగు నీటి వనరులతో సహా ఇతర శాఖలను సోదాహరణలుగా తీసుకోన్న సిఎం., ఆ దిశగా బడ్జెట్ ప్రపోజల్స్ ను రూపోందించాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం బడ్జెట్ ను రూపొందించే క్రమంలో ముందుగా గత నాలుగు సంవత్సరాల కాలంలో ఎంత ఖర్చు చేసింది రాబోయే ఐదేండ్ల కాలంలో ఎంత ఖర్చు చేయనున్నది..అనే అంశాన్ని పరిగణలోకి తీసుకావలని సిఎం సూచించారు. నడుస్తున్న ఆర్థిక సంవత్సరం సహా రానున్న ఐదేండ్లకాలానికి  మొత్తం కలిపి ఇరిగేషన్ శాఖ కోసం రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చుకానున్నట్టు సిఎం తెలిపారు. కేంద్రం నుంచి అన్ని సాగునీటి ప్రాజెక్టులకు అన్నిరకాల అనుమతులను సాధించడం గొప్పకార్యమని అది బడ్జెట్ లో ప్రతిఫలించాలన్నారు. గొర్రెల పంపిణీకి సంబంధించిన ఉదాహరణను ప్రస్తావించిన సిఎం అది ఎంతగొప్పగా ప్రజాదరణ పొందిందో తెలిపారు. దాంతో పాటు చేపల పెంపకం చేనేత రంగం,రాష్ర్ర్టంలో పురోగతని సాధిస్తున్నట్టుగా చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ర్ట చేనేత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో చేనేత కార్మికుల కళను పూర్తిస్తాయిలో వినియోగించుకోవా లన్నారు. దాంతో పాటు విద్యుత్ సగటు వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని పేర్కొన్నారు.  బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనకు ముందు ఈ అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆకర్షనీయ పర్యాటక కేంద్రంగా, భక్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎటువంటి విధానాలను అనుసరించాలో బడ్జెట్ రూపొందించే క్రమంలో సూత్రప్రాయంగా తగు సూచనలు చేస్తే బాగుంటుందన్నారు. అక్కడి త్రివేణి సంగమం అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారబోతోందన్నారు. పర్యాటక ప్రయోజనాలమీద బడ్జెట్ ద ష్టి కేంద్రీకరించాలన్నారు. యునివర్సీటీ పరిశోధనలతో పాటుగా వ్యవసాయాన్ని అధునీకరించే అ:శాలపై అధికారులు విధి విధానాలను రూపొందించాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ను ఏవిధంగా ముందుకు తీసుకు పోవాలో ఆ అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. వైద్య విద్య రంగాలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి ప్రయివేటు యూనివర్సిటీల వల్ల కలిగే ప్రయోజనాలను పరిశీలించాలన్నారు. ఇతర రాష్ట్రాలకు వసలపోకుండా రాష్ర్టంలో విద్యావ్యవస్థను ఆకర్షణీయంగా రూపొందించే దిశగా అంతర్జాతీయ విద్యార్ధులను ఆకర్షించే దిశగా విధి విధానాలను రూపొందించాలన్నారు.  ఆరోగ్య తెలంగాణ దిశగా మానవీయ కోణంలో బడ్జెట్ విధానాలను రూపొందించాలని సిఎం అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా శద్దిచేసిన పరిశుభ్రమైన తాగునీరు లభిస్తున్నదని., అది రాష్ట్రాభివ ద్ది సూచికగా సిఎం పేర్కోన్నారు. పారిశ్రామిక అవసరాలను, మౌలిక సదుపాయాల అవసరాలను ద ష్టిలో ఉంచుకుని బడ్జెట్ అంచనాలను రూపొందించాలన్నారు.

హైదరాబాద్ సిటీ గురించి
‘‘హైదరాబాద్ గ్లోబల్ సిటీ. దేశంలోని ఏదు పెద్ద నగరాల్లో హైద్రాబాద్ వొకటి. కనీసం 100 పార్కుల అవసరం వున్నది. హైద్రాబాద్ ను రక్షించడానికి రేపటి భవిష్యత్తు తరాలను ద ష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. అందులో వొక్క పేరాను మార్చాలంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకునేంత స్థిరంగా నియమావళి రూపొందించాలన్నారు.  రాబోయే ఐదేండ్ల కాలంలో హైద్రాబాద్ ను అద్భుతమైన గ్లోబల్ సిటీగా రూపొందించే దిశగా, ఎంతఖర్చు చేయాల్సి వున్నదో బడ్జెట్ ప్రతిపాదనలు ప్రతిఫలించాలి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు హైద్రాబాద్ వెన్నముక లాంటిది..’’ అని సిఎం తెలిపారు.

మంత్రులకు సెక్రెటరీలకు శిక్షణకు సంబంధించి
క్యాబినెట్ రూపొందిన వెంటనే మొత్తం మంత్రులకు ఆయాశాఖల కార్యదర్శులకు  వారి విధులు బాధ్యతలమీద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆధ్వర్యంలో సునిశిత శిక్షణాకర్యాక్రమాలు చేపట్టాలని సిఎం సూచించారు. రాష్ర్టంతో సహా దేశ ఆర్ధిక వ్యవహారాలను,  సచివాలయ విధి విధానాలు, బడ్జెట్ రూపకల్పన నిబంధనలు, వాటి పరిమితులు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఆయా మంత్రిత్వ శాఖల్లో చేపట్టే కార్యక్రమాలు అన్నీ సంబంధిత మంత్రుల కు తెలిసేలా శిక్షణ వుండాలన్నారు.

Tags

సంబంధిత వార్తలు