రూ. 5కే భోజనం.. ఎందరికో వరం

Updated By ManamFri, 11/09/2018 - 01:46
full meals for Rs. 5 only

imageజంటనగరాల పరిధిలో పలుచోట్ల ఏర్పాటుచేసిన భోజన కేంద్రాల దగ్గర మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు చూస్తే.. విభిన్న వర్గాల వారు కనిపిస్తుంటారు. ఆ కేంద్రం ఉన్న ప్రదేశాన్ని బట్టి సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకునే విద్యార్థులు, చిన్న పాటి ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అన్ని వయసులు, అన్ని ఆర్థిక స్థాయిల వారు కూడా అక్కడ నిలబడి కేవలం రూ. 5కే పెడుతున్న అన్నామృతాన్ని కడుపారా ఆరగిస్తుంటారు. అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో 109 ప్రాంతాలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

వేడివేడిగా వడ్డిస్తుండటం, కేవలం ఐదు రూపాయలు మాత్రమే వెచ్చించినా కడుపు నిండా అన్నం పెట్టడంతో..image చాలామంది క్యారేజీలు తీసుకెళ్లడం మానేసి అక్కడ తింటున్నారు కూడా. జంటనగరాల్లో ఈ పథకం అత్యంత విజయవంతం కావడంతో మిగిలిన కార్పొరేషన్ల పరిధిలో కూడా వీటిని ఏర్పాటుచేయడానికి శ్రీకారం చుట్టారు. ఆసుపత్రులు, లేబర్ అడ్డాల వద్ద వీటిని శాశ్వతంగా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉన్న కేంద్రాలను 150కి పెంచడానికి కూడా రంగం సిద్ధం చే శారు. అమీర్‌పేట మైత్రీవనం చుట్టుపక్కల అనేక కోచింగ్ సెంటర్లుంటాయి. వీటికి సమీపంలో ఉన్న 5 రూపాయల అన్నపూర్ణ కేంద్రాలు ఎప్పుడూ విద్యార్థులతో బిజీబిజీగా ఉంటాయి. మధ్యాహ్నం అక్కడ భోజనం పెట్టే గంట సేపటిలో చాలామంది అక్కడకు వచ్చి 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసి వెళ్తుంటారు. తమకు హాస్టళ్లలో పెట్టే తిండికంటే ఇది చాలా బాగుంటుందని, దానికితోడు వేడివేడిగా వడ్డిస్తుండటంతో చకచకా తినేయబుద్ధి వేస్తుందని అక్కడి విద్యార్థులు చెబుతుంటారు.

మాసాబ్‌ట్యాంక్‌కు కొద్ది ముందున్న కేంద్రం వద్ద కూడా చాలామంది చిరుద్యోగులు, మార్కెటింగ్ ఉద్యోగులు వచ్చి భోజనం చేస్తుండటం నిత్యం కనిపిస్తుంది. మార్కెటింగ్‌పనుల మీద బయటకు వెళ్లే తమలాంటివాళ్లు ఉదయం బాక్సు కట్టుకుని వచ్చినా ఎక్కడో ఒకచోట కూర్చుని తినే అవకాశం ఉండదని, పైపెచ్చు అది అప్పటికి చల్లారిపోతుంది కాబట్టి తినబుద్ధి కాదని, అదే ఇక్కడ అయితే కేవలం 5 రూపాయలే ఇచ్చినా వేడిగా, రుచిగా, శుచిగా పెడుతుం డటంతో ఎంచక్కా తింటున్నామని శ్రీనివాస్ అనే మార్కెటింగ్ ఉద్యోగి తెలిపారు. 
 

English Title
full meals for Rs. 5 only
Related News