పూర్తి స్థాయి ఏర్పాట్లు

rajath kumar
  • 5 గంటల్లోపు టోకెన్ తీసుకుంటే 7 వరకూ ఓటేయొచ్చు

  • ఎపిక్ కార్డులేని పక్షంలో ఇతర గుర్తింపు కార్డులూ చూపొచ్చు

  • ఈవీఎంలో సమస్యలొస్తే అరగంటలో మరోటి ఏర్పాటు

  • ధన, మద్య ప్రవాహాల కట్టడికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు

  • ఓటర్ల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలు, సౌకర్యాలు

  • వెబ్‌క్యాస్టింగ్‌తో పారదర్శకత : రజత్‌కుమార్

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు కట్టదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి టోకెన్స్ ఇస్తామనీ ఎన్నికల ప్రధాన అధికారి  డా.రజత్‌కుమార్ వెల్లడించారు. సాయంత్రం 5గంటల లోపు టోకెన్స్ తీసుకున్న వారికోసం రాత్రి 7గంటలవరకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. వారు 7గంటల వరకు వారి ఓటు హక్కును విని యోగించుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నా రు. డబ్బులు, మద్యం పెద్ద ఎత్తున పంపిణీ అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. దాని అరికట్టేందుకు ప్లైయింగ్ స్క్యాడ్‌లు ఏర్పాటు చేశామన్నారు.  కేంద్రాన్ని కోరిన అన్ని బలగాలు వచ్చాయని, ఎపిక్ కార్డు లేకపోతే ఓటర్ స్లీప్‌తో పాటు 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకుని వస్తే సరిపోతుందని వివరించారు. అన్ని జిల్లాలో ఎపిక్ కార్డులు ,ఓటర్ సిప్పులు పంపిణీ చేశాం. 26డిసెంబర్ నుండి  పార్లమెంటు ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారు చేస్తామని తెలిపారు. ఓటు లేని వాళ్ల అందరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు.13 నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 4గంటలకు పోలింగ్ ముగుస్తుంది . మిగతాచోట్ల సాయంత్రం 5గంటలవరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈవీఎంలో ఎలాంటి సమస్యలురావని, ప్రతి సెక్టార్ మేజిస్ట్రేట్ వద్ద 2 ఈవీఎంలు,వీవీప్యాట్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈవీఎంలో ఏమైనా సమస్యలు తలెత్తితే 30 నిమిషాల్లో కొత్తవి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని, 3,578 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను ఈసీ నేరుగా మానిటరింగ్ చేస్తుందని వెల్లడించారు.


ఓటర్ల కోసం సహాయ కేంద్రాలు...
ఓటరు గుర్తింపు కార్డులు లేని వారి కోసం సహాయకేంద్రాలు ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో దాదాపు అందరికీ ఎపిక్ కార్డులు అందించామని, ఓటు వేయడానికి నిర్ధేశించిన ఏదో ఒక గుర్తింపు పత్రం తప్పనిసరి అని, 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి తీసుకురావాలని సూచించారు. ప్రతి ఓటరు తమ హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. దివ్యాంగులు ఓటు వేసేలా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని, పోలింగ్ కేంద్రాల వరకు వారికి ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేశామని,వీల్ చైర్లు ,రెయిలింగ్స్, ర్యాంప్‌లు కూడా అందుబా టులో ఉంచామని అన్నారు.కొన్నిచోట్ల మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు.

సంబంధిత వార్తలు