‘హ్యాపీనెస్ట్’ఫ్లాట్లకు అనూహ్య స్పందన

Updated By ManamFri, 11/09/2018 - 14:25
Full demand to Amaravati Happynest flots, says CRDA commissioner Sridhar
Full demand to Amaravati Happynest flots, says CRDA commissioner Sridhar

అమరావతి : హ్యాపీనెస్ట్ ఫ్లాట్ల అమ్మకాలకు అనూహ్య స్పందన వచ్చినట్లు సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ‘హ్యాపీ నెస్ట్’ ఫ్లాట్ల  విక్రయం శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైంది.

ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ..‘హ్యాపీనెస్ట్’ ఫ్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. గత వారం తమకు 17 వేల ఫోన్ కాల్స్ రావటమే ఇందుకు తార్కాణం. సుమారు లక్షా 10వేలమంది వెబ్‌సైట్ ఓపెన్ చేయడంతో సర్వర్ డౌన్ అయింది. 

ఒకసారి 300మంది మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 80శాతం ఫ్లాట్లు అమ్మకానికి దగ్గర్లో ఉన్నాయి. వచ్చే గురువారం మరో 300 ఫ్లాట్లు అమ్మకానికి పెడతాం.  ‘హ్యాపీనెస్ట్’ ఫ్లాట్లలో సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వలని ముఖ్యమంత్రి కోరారు.

మొదట వచ్చిన వారికే మొదటి కేటాయింపు ప్రాతిపదికన పూర్తి పారదర్శకత పాటించాలని సీఎం  ఆదేశించారు. అవసరమైతే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు హ్యాపీనెస్ట్ తరహా గృహాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.  భూమి ధరను చూసి నైష్పత్తిక ప్రాతిపదికన ధర నిర్ణయించాలని సీఎం కోరారు.’ అని సీఆర్డీఏ కమిషనర్ పేర్కొన్నారు.

English Title
Full demand to Amaravati Happynest flots, says CRDA commissioner Sridhar




Related News