కక్ష సాధింపే..!!

Updated By ManamFri, 11/09/2018 - 01:40
Dharmana Prasada Rao
  • కేసులకు భయపడం

  • విశాఖ భూ కుంభకోణంలో సిట్ దర్యాప్తు సజావుగా సాగలేదు

  • ప్రభుత్వ పెద్దలను తప్పించి.. సామాన్యులను ఇరికించే ప్రయత్నం

  • వైఎస్ కుటుంబానికి అండగా ఉన్నందుకే..: ధర్మాన

dharmana-prasad-raoశ్రీకాకుళం: విశాఖ భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తులో తన పేరు చేర్చి..టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, వీటికి భయపడేది లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అండగా ఉంటూ.. ప్రజల సమస్యలపై పోరాడుతున్నందుకే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆ అక్కసుతోనే..తన భూకుంభకోణంలో తన పేరు చేర్చారని మండిపడ్డారు.  శ్రీకాకుళంలోని వైసీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాడుతూ.. విశాఖ భూ కుంభకోణంలో సిట్ దర్యాప్తు సజావుగా సాగలేదని మండిపడ్డారు.  ప్రభుత్వ భూములను అసైన్డ్ భూములుగా మార్చి.. అధికార పార్టీ పెద్దలు వాటిని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు..ఈ అంశాన్ని  అసెంబ్లీలో లేవనెత్తినందుకే.. ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిందని గుర్తుచేశారు. వాస్తవానికి విష్ణుకుమార్ రాజు..సభాపక్షాన్ని వేయాలని, లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని  కోరారని, కానీ అలా.. జరిగితే..ప్రభుత్వ పెద్దల బాగోతాలు బయటపడతాయని,  అందుకే తమ కనుసన్నల్లో  ఉండే..సిట్‌ను వేశారని విమర్శించారు. ప్రభుత్వపెద్దలకు ఇందులో భాగస్వామ్యం ఉన్నందుకే తన వంటి వారి పేర్లను చేర్చి, విచారణను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ భూములకు సంబంధించి..రికార్డులు ట్యాంపరింగ్ అయ్యాయని ప్రభుత్వమే ఒప్పుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాన గుర్తు చేశారు. ఈ కుంభకోణంలో అధికార పార్టీకి చెందినపెద్దనేత హస్తం ఉందన్నారు.

11 రోజుల్లో ఫైల్ క్లియరెన్సా?
విశాఖ భూ కుంభకోణంలో కేవలం 11 రోజుల్లోనే ఫైల్ క్లియర్ అయ్యిందని, దీన్ని బట్టి..ఏ స్థాయి వ్యక్తి ఈ కుంభకోణంలో ఉన్నారో..ఇట్టే చెప్పవచ్చని ధర్మాన ఎద్దేశా చేశారు. ఒక జూనియర్ అసిస్టెంట్  టేబుల్ మీది నుంచి.. సీనియర్ అసిస్టెంట్ సీటుకు వెళ్లాలంటే.. నెలల పాటు కాలయాపన జరిగే ఈ ప్రభుత్వంలో 11 రోజుల్లో ఫైల్ క్లియరెన్స్ ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. వాస్తవానికి ఎసైన్డ్ భూములకు సంబంధించిన జీవోను 1994లో రెవెన్యూమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడే విడుదల చేశారన్నారు.  భూ కుంభకోణంలోని అసలు ముఖాలు బయటపెడతానని ధర్మాన హెచ్చరించారు.

English Title
Fucking the Future .. !!
Related News