కలిసి కొట్లాడితేనే ఫాయిదా

Updated By ManamSun, 07/22/2018 - 01:08
nayini
  • సంఘాల ఐక్యతే కార్మికులకు రక్ష

  • సంఘటిత పోరుతోనే హక్కుల సాధన.. చట్టాలను కాలరాయజూస్తున్న కేంద్రం

  • రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని.. గౌర్ శత జయంతి వేడుకలు ప్రారంభం

  • నిజాం నిరంకుశత్వంపై పోరాడారని ప్రశంస.. ఏడాది పాటు ఉత్సవంగా నిర్వహణ: చాడ

nayiniహైదరాబాద్: దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాయాలని చూస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆక్షేపించారు. కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడితేనే హక్కు లను కాపాడుకుంటూ డిమాండ్లను నెరవేర్చుకోవ చ్చన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్ శత జ యంతి ఉత్సవాల ప్రారంభసభ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఏడాది పాటు జరగనున్న ఉత్సవాలను గౌర్ చిత్రపటానికి పూల మాల వేసి నాయిని ప్రారంభించారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ముఖ్యుల్లో గౌర్ ఒకరని నాయిని కొనియాడారు. గౌర్ నాయకత్వంలో పీడీఎఫ్‌లో పన్జేసిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. నాటి నాయకుల నిబద్ధత, సిద్ధాంతాలు నేటి నాయకుల్లో తీసుకొచ్చేందుకు శతజయంతి ఉత్సవాలు స్ఫూర్తిగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. ఆర్టీసీ, సింగరేణి, బ్యాంకింగ్, వైద్య రంగాల్లో గౌర్ కార్మిక సంఘాలను స్థాపించారని గుర్తు చేశారు. నాడు ఆయన పన్జేయని కార్మిక సంఘం, రంగం లేదన్నారు. గౌర్ స్ఫూర్తితోనే హెచ్‌ఎంఎస్ స్థాపించి యాభై ఏండ్లపాటు కార్మికుల పక్షాన పోరాడానని తెలిపారు. కార్మిక సంఘాలు బలంగా ఉన్నప్పుడే కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు. కాంట్రాక్టు కార్మికులకు నేటికీ అన్యాయం జరుగుతూనే ఉందన్నారు.

నేటి తరాలకు ఆ స్ఫూర్తి అందాలి
గౌర్ స్ఫూర్తి నేటి తరం యువత, నాయకులకు అందాలని మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఇందుకోసం కృషి చేస్తున్న సీపీఐ నాయకులను నాయిని అభినందించారు. తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీ విశేష కృషి చేసిందని ప్రశంసించారు. కార్మికుల పక్షాన నిలిచే సీపీఐ బలపడాల్సిన అవసరముందన్నారు. గౌర్ జయంతి ఉత్సవాలకు హెచ్‌ఎంఎస్ తరఫున నాయిని రూ.10 వేలు అందించారు. ప్రభుత్వం తరఫున సాయం చేసేందుక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గౌర్ జీవిత విశేషాలతో రచించిన పుస్తకాన్ని నాయిని ఆవిష్కరించారు. పల్లె నుంచి పట్నం వరకూ గౌర్ శత జయంతి ఉత్సవాలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహిస్తామని సభ అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. గౌర్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడమంటే తెలంగాణ తన వందేళ్ల చరిత్రను గుర్తు చేసుకోవడమేనని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం కొనియాడారు. రాజకీయ విలువలకు గౌర్ నిదర్శనమన్నారు.

Tags
English Title
Fucked together
Related News