మిత్రుడు

Updated By ManamMon, 10/15/2018 - 04:47
friend

friendఏళ్ళుకు ఏళ్ళుగా 
జీవన భ్రమల అనంతంలో
బతుకు బుడగ మీద 
ఎప్పుడో తప్పిపోయిన నాకు
వాడు కనబడ్డప్పుడు గానీ
నేను మళ్ళీ నాకు కనపడను

గెలుపు ఓటమిల మజిలీల మధ్యన
నెత్తుటి గాయాలూ మెత్తటి గేయాలు మీదగా
ఎన్ని అడుగులై జీవితం సాగదీసుకున్నా
కుడిభుజం పక్కన ఆ అడుగు
నా అడుగుపక్కన పాదముద్రయినప్పుడు గానీ
నేను నడిచినదూరం సుస్పష్టం కాదు
రెండుగా క్రోడీకరించుకున్న కన్నీటిభాష
దుఃఖాశ్రువూ ఆనందబాష్పాలుగా
ప్రవహించీ ప్రవహించీ రెండు పాయలయ్యాక
ఆ చెయ్యి భుజాన వాలినాకగానీ
చూస్తున్న సినిమాలోని అసలు మజా తెలీదు

ఎక్కడో చంపబడ్డ నన్ను
వాడు పిలిచాక గానీ
బతికున్నానన్న నమ్మకం కుదరదు
ఎన్ని బంధాలు వెంబడించినా

ఎన్నెన్ని అనుబంధాల్ని కుమ్మరించుకున్నా
గుండెను తెరిచి చూడగలిగేది వాడొక్కడే
వాడు నాలోకి  తొంగిచూశాక గానీ
నిజంగా నా గుండెచప్పుడు నాకు వినపడదు
- బంగార్రాజు కంఠ
8500350464

Tags
English Title
Friend
Related News