ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డుప్రమాదం

Updated By ManamSun, 10/14/2018 - 17:50
Massive Road accident, Chattisgharh, SUV car, Truck turns
  • ఒకే కుటుంబంలో తొమ్మిది మంది దుర్మరణం

  • ఎస్‌యూవీ కారును ఢీకొట్టిన ట్రక్కు.. భిలాయ్ సమీపంలో ఘటన

Massive Road accident, Chattisgharh, SUV car, Truck turns భిలాయ్‌: ఛత్తీస్‌గఢ్‌‌లోని భిలాయ్‌ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మృతులంతా ఏపీలోని ప్రకాశం జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. భిలాయ్‌ సమీపంలోని దుర్గ గుడి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది.

దాంతో కారులోని తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ప్రకాశం జిల్లా మంగలంపల్లికి చెందిన పెద్దమంగయ్య, వెంకటలక్ష్మి, మనీష, మహేందర్‌గా గుర్తించగా, వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయినట్టు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

English Title
nine killed in Massive Road accident at Chattisgharh 
Related News