ప్రశ్నించే తత్త్వమే శాస్త్రీయతకు పునాది

Updated By ManamThu, 06/14/2018 - 00:13
image

imageఎందుకు కొందరు దేవుడి వైపు, ఆధ్యాత్మికత వైపు, మూఢ విశ్వాసాల వైపు మొగ్గు చూపు తారు? ఎందుకు మరికొందరు అందుకు విరుద్ధంగా ఉందా మంటారు? సమాజంలో హేతు బద్ధత పెంచుతూ, జీవ పరిణా మాన్ని, మానవ విజయాల్ని పరిగణనలోకి తీసుకుని, మాన వీయ విలువలతో బతుకుదా మంటారూ? మనుషులందరికీ ఆలోచించే మెదడు ఒకటే కదా? మానవ మేధస్సులో అనాదిగా ఈ అంతర్యుద్ధం ఎందుకు జరుగుతోంది? ఈ సంఘర్షణ కొనసాగుతూ ఉండాల్సిందేనా? - అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం కోసం ఇటీవల కొన్ని పరిశోధనలు జరిగాయి. కొన్ని వందల మంది స్త్రీ, పురుషుల మెదడ్లు స్కాన్ చేసి అధ్యయనం చేశారు. వివరాలు ్కఔైఖి ైూఉ సంస్థ ప్రచురించింది. పరిశోధ నల వల్ల శాస్త్రవేత్తలు తెలుసుకున్నదేమంటే, మెదడు నిర్మాణంలో కొన్ని తేడాలుండడం వల్ల మనుషులు ఇలా భిన్నంగా ప్రవర్తిస్తు న్నారని! - ఇది ఒక కారణమైతే, మెదడును పనిచేయించే విధానం, లేక ఉపయోగించే తీరును బట్టి కూడా వారు ఎన్ను కునే దారులు వేరైపోతున్నాయన్నది - మరొక కారణం! ఇవికాక, మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఏదో ఒక శక్తిని, ఒక దేవుడిని, దేవతను నమ్మేవారు తమ మెదడులోని విజ్ఞతను, వివేకాన్ని, జిజ్ఞాసను అణచివేస్తున్నారని! సమాజాన్ని, పరిస రాల్ని, దైనందిన జీవితాన్ని నిరంతరం విశ్లేషించుకుంటూ ఉండే లక్షణాన్ని వారు మెదడు పొరల్లోనే పాతేస్తున్నారని!!

మెదడు నేల మీద కొత్త మొక్కలు మొలిచే అవకాశమే లేకుండా ‘విశ్వాసమనే’ గచ్చుచేసుకుని, జీవితం హాయిగా ఉంద నుకుంటూ భ్రమలో బతికేస్తున్నారని!! టూకీగా పరిశోధకులు చెప్పిన కారణాలు ఇవి - సాంకేతిక పదజాలం తీసేసి, నేనిక్కడ సారాంశం మాత్రమే ఇస్తున్నాను. ప్రతి మెదడులో ఈ రెండు ధోరణులకు వీలుంది. ఆధ్యాత్మికత భావనలకు, మతపరమైన నమ్మకాలకు చోటును మెదడులోనే మరోవైపు ప్రశ్నించే తత్వం, విశ్లేషించే నేర్పూ ఉన్నాయి! ఆ మనిషి దేవుడి వైపు మొగ్గు చూపితే అతను / ఆమె భక్తులవుతారు. అంటే, భక్తి పార వశ్యంలో తేలిపోయే భక్తుడు తన మెదడులోని ఇంగిత జ్ఞానాన్ని సమాధి చేసి పైకి లేస్తాడు. అదే ఒక హేతువాది తన నేపథ్యంలో, వారసత్వంగా, కొన్ని శతాబ్దాలుగా ప్రవహిస్తూ వస్తున్న మూఢ భక్తికి అడ్డుకట్టవేసి లోకంలో కొత్త వెలుగు రేఖలు చూస్తాడు. తనలోని వివేచనను బావుటాలా పైకెత్తి ఛాందసపు చీకట్లను పారదోలుతాడు. 

కేస్ వెస్టరన్ రిజర్వులో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న టోనీ జాక్, అతని వైజ్ఞానిక బృందం వందల మంది మెదడ్లు ఎఫ్ ఎం.ఆర్.ఐ స్కాన్ చేశారు. వచ్చిన ఫలితాల్ని వారివారి అభిప్రాయాలతో, దృక్పథాలతో అనుసంధానం చేసి పరిశీలించారు. అంతిమంగా వచ్చిన సారాంశాన్ని ప్రజలకు తెలియజేశారు. మెదడులో వేర్వేరు న్యూరాన్ నెట్‌వర్క్‌లు ఉన్నాయని, మనిషి ఏ నెట్‌వర్క్‌ను ఎక్కు వగా ఉపయోగించుకుంటాడో అతని భావాలు ఆ దిశలోనే ఉంటాయని ఆ బృందం చెప్పింది. సామాన్యంగా అయితే, ఏదో ఒక నెట్‌వర్క్ చురుకుగా పనిచేస్తుంది. మరో నెట్‌వర్క్ పని చేయకుండా ఉంటుంది. అందుకే సమాజంలో దేవుడున్నాడనే వారో, లేక లేడనే వారో ఉంటున్నారు. మరి కొందరు ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఉంటున్నారు కదా? దానికేమిటి సమా ధానం? లేదా కొంతమంది పేరుమోసిన శాస్త్రవేత్తలే ఆధ్యాత్మికత లో మునిగి తేలుతున్నారు కదా- అని అంటే, అలాంటి వారిలో ఆ రెండు రకాల నెట్‌వర్క్‌లు కొంత కొంత పనిచేస్తున్నాయన్న మాట! అందుకే కదా వారు సంశయాలతో బతుకుతూ తమ విలువ తగ్గించుకుంటున్నారు? దీనికి దేశ మాజీ రాష్ట్రపతులే గొప్ప ఉదాహరణ! అబ్దుల్ కలాం రాకెట్ సైంటిస్టుగా ఖ్యాతి పొంది, పుట్టపర్తి సాయి బాబా లాంటి ఎంతోమంది ముందు మోకరిల్లారు. అంతే కాదు, ఈ విశ్వంలోని గ్రహా లన్నీ పుట్టపర్తి సాయిబాబా చు ట్టూ పరిభ్రమిస్తున్నాయని కూ డా వ్యాఖ్యానించారు. ఆయన బలహీనతలు ఆయనకు ఉండొచ్చుగాక, దేశ ప్రథమ పౌరుడి హో దాలో ఉండి, ఈ దేశ గౌరవం, దేశ పౌరుల ఆత్మవిశ్వాసానికి భం గం కలగకుండా ప్రవర్తించాల్సిన బాధ్యత ఆయనకు ఉండింది కదా?
 
కొన్ని శతాబ్దాలుగా దైవ భావనను సమాజంలో ప్రతిష్టిం చాలని అన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇప్పటికీ దైనందిన జీవి తంలోని సంభాషణల్లో దేవుడి ప్రసక్తి ఉండకుండా ఉండదు. పురాణాలు, హరికథలు, భజనలు, గుళ్ళు, సంగీతం, నాట్యం - వీటన్నింటి ధ్యేయం ఒకటే కదా? దేశాలు, మతాలు, భాషలు వేర్వేరు కావొచ్చు కానీ దైవభావన నిలుపడానికి అంతా ఒక్కు మ్మడిగా ప్రయత్నిస్తూ వచ్చాయి. ప్రయత్నిస్తూనే ఉన్నాయి. పైగా ప్రశ్నిస్తూ వైజ్ఞానికంగా ఎదుగుతూ వచ్చిన శాస్త్రజ్ఞుల్ని, వైజ్ఞానిక కార్యకర్తల్ని, అభిమానుల్ని, ఉపాధ్యాయుల్ని మతపెద్దలు చిత్ర హింసలు పెట్టారు. భారతీయ సంస్కృతిలో దేవుణ్ణి ప్రశ్నించిన చార్వాకులు, నిరీశ్వరవాదులు, హేతువాదులూ కూడా ఉన్నారన్న విషయం మరిచారు. మరిచినట్టు నటించారు. ఇంకా నటిస్తున్నారు. 

పుట్టిపెరిగిన సమాజ నేపథ్యం, కుటుంబ నేపథ్యం వగైరాల ప్రభావం మనిషి మీద కొంత ఉన్నా - ఈ భేదాలు రావడానికి ప్రధాన కారణం... మెదడును చురుకుగా పనిచేయించడం, ప్రశ్నిస్తూ జవాబుల కోసం అన్వేషిస్తూ ఉండడం, ఆలోచనల్ని సమాహారంగా తీర్చిదిద్దుకుని తమకై తాము ఒక దృక్పథం ఏర్పరుచు కోవడం మీద ఫలితం ఉంటుందని పరిశోధనల్లో తేలింది. పరమఛాందస కుటుంబంలో పుట్టిన వాడైనా కమ్యూ నిస్ట్‌గా, హేతువాదిగా తయారు కావొచ్చు. నాస్తికవాద వాతావరణంలో పుట్టి పెరిగినా, కొంతమంది ఆ ధోరణిని ముందుకు తీసుకుపోకుండా, అలసత్వంతో జాతకాల్ని నమ్ముతూ కాలం వెళ్ళబుచ్చేవాళ్ళుగా కావొచ్చు. అందువల్ల ఛాందసవాదమా? హేతువాదమా? ఎటువైపు మన పయనం అనేది వ్యక్తులుగా ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన విషయం! ఒక్కటి మాత్రం నిజం! పౌరులుగా బాధ్యత గల వాళ్ళంతా వైజ్ఞానిక స్పృహ వైపే ప్రయాణిస్తారు!!
image
- రచయిత సాహితీ వేత్త, బయాలజీ ప్రొఫెసర్

English Title
The foundation of questioning philosophy is the foundation
Related News