మళ్ళీ మొదటి కొచ్చిన ఫోర్టిస్ కథ

Updated By ManamWed, 07/11/2018 - 22:13
fortis
  • శుక్రవారం సమావేశమవుతున్న డైరెక్టర్ల బోర్డు

fortisన్యూఢిల్లీ: ప్రాధాన్యతా కేటాయింపు ప్రాతిపదికన సెక్యూరిటీల జారీ ద్వారా నిధులు సమీకరించే అంశాన్ని పరిశీలించేందుకు ఫోర్టిస్ హెల్త్‌కేర్ డైరెక్టర్ల బోర్డు జూలై 13న సమావేశమవుతోంది. నగదు కొరతతో బాధపడుతున్న ఫోర్టిస్ హెల్త్‌కేర్ కొత్త ఇన్వెస్టర్‌ను కనుగొనే ప్రక్రియలో ఉన్న సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పాటైన డైరెక్టర్ల బోర్డు తాజా విడత బిడ్లను ఆహ్వానించినప్పుడు, చివరి తేదీ అయిన జూలై 3 నాటికి మలేషియాకు చెందిన ఐ.హెచ్.హెచ్ హెల్త్‌కేర్ నుంచి, మణిపాల్-టి.పి.జి ద్వయం నుంచి కంపెనీకి బైండింగ్ బిడ్లు అందాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్, రేడియంట్ లైఫ్ కేర్‌ల స్వాధీనానికి ఇంతకుముందు అగ్ర స్థానంలో నిలిచిన ముంజల్-బర్మన్ ద్వయం వెనక్కి తగ్గింది. శుక్రవారం సమావేశమవుతున్న డైరెక్టర్ల బోర్డు ఎంత మొత్తానికి నిధులు సేకరించాలనుకుంటున్నదీ కంపెనీ వెల్లడించలేదు. 
చిక్కుల్లో ఉన్న ఫోర్టిస్ హెల్త్‌కేర్ కొత్త ఇన్వెస్టర్‌ను కనుగొనేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నిస్తూ వస్తోంది. రెండు వేర్వేరు సందర్భాలలో అది మణిపాల్-టి.పి.జి ద్వయం, ముంజల్-బర్మన్ ద్వయం సమర్పించిన ఆఫర్లను అంగీకరించింది. తర్వాత, వాటిని రద్దు చేసుకుని, తాజా బిడ్లకు ఆహ్వానించింది. సంస్థను స్వాధీనపరచుకోదలచినవారు ఎవరైనా సరే, ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లోకి ప్రిఫరెన్షియల్ కేటాయింపు ద్వారా కనీసం రూ. 1500 కోట్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు మే 29న ఒక కొత్త షరతు విధించింది. కొనుగోలు సంస్థకి ఆర్.హెచ్.టి హెల్త్ ట్రస్ట్ స్వాధీనానికి నిధులు సమకూర్చుకునే ప్రణాళిక ఉండాలి. అలాగే, దాని డయాగ్నస్టిక్ విభాగమైన ఎస్.ఆర్.ఎల్ నుంచి ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్ల నిష్క్రమణకు వీలు కల్పించే ప్రణాళికను కూడా సిద్ధం చేసుకోవాలి.

మాజీ ప్రమోటర్లు మల్వీందర్  సింగ్, షివీం దర్ సింగ్‌ల నియంత్రణలో ఉన్న సంస్థలకు ఇంటర్-కార్పొరేట్ డిపాజిట్ల రూపంలో ఇచ్చిన సుమారు రూ. 500 కోట్లను తిరిగి రాబట్టేందుకు న్యాయపరమైన చర్యకు దిగుతున్నట్లు ఫోర్టిస్ హెల్త్‌కేర్ ప్రకటించిన తర్వాత, మంజల్-బర్మన్ కుటుంబ ద్వయం, రేడియంట్ లైఫ్‌లు వెనక్కి తప్పుకున్నాయి. డైరెక్టర్ల బోర్డు ఆమోదం లేకుండా, తగినంత తనఖా భద్రత లేకుండా ఆ రుణాలు ఇచ్చేశారు. కంపెనీ వ్యవహారాలపై ఫోరెన్సిక్ దర్యాప్తునకు ‘సెబి’ ఆదేశించింది. మే 22న నిర్వహించిన కంపెనీ షేర్‌హోల్డర్ల అసాధారణ సర్వ సభ్య సమావేశంలో డైరెక్టర్ల బోర్డు నుంచి బ్రయా న్ టెంపస్ట్‌ను తొలగించారు. రెండు మదుపు సంస్థలు తొలగించాలని కోరిన నలుగురు డైరెక్టర్లలో ఆయనొకరు. మిగిలిన ముగ్గురు (హర్పాల్ సింగ్, సబీనా వైశోహ, తేజీందర్ సింగ్ షెర్గిల్‌లు) సర్వ సభ్య సమావేశానికి ముందే రాజీనామా చేశారు. బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా కొత్తగా సువలక్ష్మి చక్రబర్తి, రవి రాజగోపాల్, ఇంద్రజీత్ బెనర్జీలు నియమితులయ్యారు. రూ. 1800 కోట్లకు ముంజల్-బర్మన్ సమర్పించిన బిడ్‌ను ఇంతకుముందరి డైరెక్టర్ల బోర్డు ఆమోదించడంతో,  పునర్నిర్మితమైన డైరెక్టర్ల బోర్డు, కొత్తగా బిడ్లను ఆహ్వానించడానికి, ముంజల్-బ ర్మన్ ద్వయం నుంచి ఆమోదం పొందింది.

Tags
English Title
Fortis story that first gave up again




Related News